తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆలయాలకు ఎంతో గుర్తింపువచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని 11 హిందూ దేవాలయాలకు 11.50 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యంతో పాటు, ఆలయ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని, ఆయా ఆలయాల మరమ్మతులు తదితర నిర్మాణాలు ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఫరూక్ నగర్ మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి 5 కోట్ల రూపాయలు, ఎలికట్ట భవాని మాత దేవాలయానికి 2 కోట్లు, మొగిలిగిద్ద రంగనాథ స్వామి దేవాలయానికి 50 లక్షలు, గిరాయి గుట్ట తండా శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయానికి 50 లక్షలు, నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయానికి 50 లక్షలు, దేవునిపల్లి వేణుగోపాలస్వామి దేవాలయానికి 50 లక్షలు, వెంకిర్యాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 50 లక్షలు, కేశంపేట మండలంలోని బైర్ఖాన్ పల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి 50 లక్షలు, వేములనర్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయానికి 50 లక్షలు, కొండారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 50 లక్షలు, తొమ్మిదిరేకుల గ్రామంలోని శివాలయానికి 50 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ తెలిపారు.