గత కొన్ని నెలలుగా కొళ్ల భావాపురం గ్రామంలో నెలకొన్న పడకేసిన పారిశుధ్యంపై రోడ్లపైనే విచ్చలవిడిగా చెత్త కుప్పలు.. ఇట్లా అయితే ఎట్లా..? అనే కథన శీర్షికతో బుధవారం తెలుగుప్రభ దినపత్రికలో ప్రచురించడం అయినది. ఈ కథనానికి స్పందించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి శోభారాణి తక్షణమే గ్రామంలో గ్రామపంచాయతీ అధికారులతో పారిశుధ్య పనులు చేయించి, త్రాగునీటి పైప్లైన్ లీకేజ్ మనమత్తులను చేయించడంతో గ్రామంలో విచ్చలవిడిగా రోడ్లపై చెత్త కుప్పలను పారిశుద్ధ్య కార్మికులు తొలగింపు కార్యక్రమాలను చేపట్టారు. దీంతో గ్రామంలో ప్రజలు తెలుగు ప్రభ దినపత్రికను అభినందిస్తూ స్పందించిన ఎంపీడీవో తీరుపై సంతోషం వ్యక్తం చేశారు.
సమాచారవాణిలో ఎంపీడీవో శోభారాణి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై తెలుగు ప్రభ దినపత్రికలో ప్రచురించబడిన కథనంతో గ్రామస్థాయి అధికారులకు గ్రామ పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించరాదని ఆదేశాలు ఇచ్చినట్టు, బుధవారం ఉదయమే వివిధ పరిసరాలలో చెత్త కుప్పల తొలగింపు, పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తుల పనులు చేయించామన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామంలో పరిష్కారం కానీ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే గ్రామస్థాయి అధికారులు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి జిల్లా అధికారులకు వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అంటూ అది గ్రామ అధికారులు తెలుసుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఎవరు నిర్లక్ష్యం చేయరాదంటూ గ్రామస్థాయి అధికారులకు సూచించారు.