కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక మహిళలు కుండల ప్రదర్శన చేసేవారు అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నియోజకవర్గం లో మంచినీటి సమస్య లేకుండా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి 8వ రోజు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలనగర్ డివిజన్లో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యకు పరిష్కారం చేశామని నీళ్లు లేక అల్లాడిపోయే బాలనగర్ ప్రజల కోసం వాటర్ ట్యాంక్ ని నిర్మించి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామనీ, బాలనగర్ డివిజన్లో ట్రాఫిక్ సమస్య కొరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించమన్నారు. పాదయాత్ర లో తిరుగుతుంటే అక్కడక్కడ చిన్నపాటి డ్రైనేజీ సమస్యలు ఎదురవుతున్నాయి అని.. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ సమస్య తలెత్తిందని దీనిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.. అదే విధంగా పెన్షన్ రాని వారికి కూడా మార్చి నుండి పెన్షన్ వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు.