మధ్యతరగతి ఆదాయ వర్గ ప్రజలకు తక్కువ ధరతో అన్ని రకాలైన మౌలిక వసతులు కల్పించి, తాము కూడా ఒక మంచి నివాసాన్ని ఏర్పరచుకోవాలన్న తృప్తి మధ్య తరగతి బడుగు వర్గాల ప్రజలకు కలగాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రారంభించారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జగనన్న లే అవుట్ స్మార్ట్ టౌన్ షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లేఔట్ బ్రోచర్ ను ఆవిష్కరించి వెబ్ సైట్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలకే కాక మధ్యతరగతి వర్గాలకు సైతం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారన్నారు. జగనన్న టౌన్షిప్ ల ద్వారా పట్టణాలలో అతి తక్కువ ధరకే ఫ్లాట్లను కేటాయిస్తారన్నారు.
పట్టణంలో జగనన్న లేఅవుట్ కోసం ప్రభుత్వ పెన్షనర్లకు 5 శాతం ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్లాట్ లో 20% ప్రత్యేక తగ్గింపు అలాగే ఒకేసారి మొత్తం చెల్లించిన వారికి 5% డిస్కౌంట్ ఇస్తారని పట్టణంలోని సర్వే నంబరు 86/1, 86/2 14.39 ఎకరాల విస్తీర్ణంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నారని అన్ని హంగులతో ప్రభుత్వం ప్లానింగ్ వారిచే లేఅట్ ద్వారా ఆమోదం పొంది అన్నిరకాల వసతులు కల్పనకు అంచనా మొత్తం 8.94 కోట్లతో ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ను ఎంఐజి లేఔట్ గా రిజిస్టర్ చేశారని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. కూడా వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ గురించి వివరంగా వివరించారు. అంతకుముందు అక్కడికి చేరు చేరుకున్న ఎమ్మెల్యే గంగులకు కూడా వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసిల్దారు హరినాధరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్రరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ , వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిక్కిలి నరహరి, పట్టణ ఇన్చార్జి కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరంనరసింహారెడ్డి,వైస్ఎంపీపీనాసారి లక్ష్మీ నరసింహ ప్రసాద్ సింగం వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లునరసింహులు ,బాలబ్బి , గురుమూర్తి, వరప్రసాద్ రెడ్డి, వరాలమ్మ ,మల్లేశ్వరి బద్రి నాగేశ్వరమ్మ, నజీర్, అజాద్ పలసానిమల్లికార్జున్,రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్,అమీర్ భాష, పంచ నాగరాజు, బాలస్వామి, మెప్మా వెంకటసుబ్బయ్య, ఎస్సై వెంకట్ రెడ్డి . సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.