TDP vs YSRCP: పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ -టీడీపీ మధ్య చెలరేగిన గొడవల విధ్వంసపు సెగలు ఇంకా ఆరలేదు. పట్టణంలో ప్రస్తుతం అల్లర్లు జరగకపోయినా.. పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. అటు శుక్రవారం నాటి ఘటనల్ని తలచుకుని బాధితులు వణికిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన సాధారణ ప్రజల్లోనూ నెలకొంది. ఇప్పటి వరకు విధ్వంసంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి.. భారీగా బలగాలను మోహరించినట్లు స్పష్టం చేశారు.
ఈ ఘటనలో టీడీపీ కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలకు నిప్పుపెట్టారు. తెనాలి పరిస్థితి సద్దుమణగక ముందే గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం హయాంలో ఏర్పా టు చేసిన క్యాంటీన్ను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్ కు అర్ధరాత్రి సమయంలో దుండగులు నిప్పు పెట్టారు.
క్యాంటీన్ తలుపు వద్దే ఈ నిప్పు పెట్టగా.. మంటలు చెలరేగటంతో గమనించి స్థానికులు మంటలను అర్పి వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటన స్థలానికి వచ్చి న టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అన్న క్యాంటీన్కి నిప్పు పెట్టటంపై అనుమానం వ్య క్తం చేస్తున్నా రు.