రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయం పనిముట్లతో కూడిన 100% సబ్సిడీతో షెడ్యూల్ కులాలకు చెందిన వ్యవసాయ రైతులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చేతుల మీదుగా పదివేల రూపాయలు విలువ చేసే విత్తనములతో కూడిన కిట్లను నాలుగు మండలాల రైతులకు పంపిణీ చేశారు. స్థానిక మండల సమావేశం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండల ఎంపీపీ ఎం.నారాయణదాసు అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం షెడ్యూల్ కులాలకు చెందిన పథకంలో ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి రైతుకు జొన్న కందులు, కొర్ర, మినుములు, నూలు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, పిల్లి పెసర, సద్దలు, రాగులు, వేరుశనగ, ఉలవలు, డ్రమ్ములు, తాత్పాలిన్, వంటివి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పకీరప్ప, మండల కో ఆప్షన్ నెంబర్ కారుమంచి నజీర్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, మండల కన్వీనర్ కారం నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, సర్పంచులు కేశవరెడ్డి, ఎంపిటిసి కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ జయ చంద్రారెడ్డి, సోమశేఖర్ నాగరాజు ఎస్సీ కార్పొరేషన్ సూపర్డెంట్ అలీ భాష సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MLA Sridevi: తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం
చిరుధాన్యాల కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES