Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్BC Mantra to win elections: ఎన్నికల్లో గెలుపోటములు శాసించేది బీసీలే

BC Mantra to win elections: ఎన్నికల్లో గెలుపోటములు శాసించేది బీసీలే

రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ కమ్యూనిటీదే

బీసీ మంత్రం ఎన్నికల తంత్రమా?
పరాయి పాలకుల దోపిడి నుంచి విముక్తి కోసం, నీటి కోసం, నిధుల కేటాయింపు కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు ప్రత్యేక తెలంగాణ సాధించి దశాబ్దం గడిచిపోయింది. అన్ని ప్రజా సంఘాలు పోరాడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదు ఇది ముమ్మాటికీ నిజం. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించేందుకు జనాభాలో 56 శాతం ఉన్న బీసీ సామాజికవర్గం మద్దతుపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
బీసీ ఓటు బ్యాంకు వ్యూహ రచనలు పోటీ
రాజకీయ పార్టీలు పోటీ పడి బీసీ మంత్రాన్ని జపిస్తు న్నాయి. బీసీ డిక్లరేషన్లు ప్రకటించడంలో పోటీ పడుతు న్నాయి బీసీల కుతాయిలాలు ఉచితాలు, పథకాల పబ్లిసి టీకి పాల్పడుతున్నాయి. బీసీలను ఓటు బ్యాంకుగా చేసు కుని అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిం చడంలో పోటీ పడుతున్నారు. రాజకీయ పార్టీల మాయ మాటల్లో బీసీ వాదం బంధించబడింది. ఎన్నికల సమయం లో బీసీ నినాదాలు చేయడం, ఎన్నికలు ముగిసిన తర్వాత నినాదాలుచేయడం మానేయడం ఆనవాయితీగా వస్తుంది.
బీసీల నాయకత్వం నిర్లక్ష్యం
ఎన్నికల ముందు బీసీ ఓట్లను ప్రసన్నం చేసుకునేం దుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికల అనంతరం ఆయా పార్టీల రాష్ట్ర జిల్లా స్థాయి కార్యవర్గాల్లో బీసీ నేతలకు ముఖ్యమైన పదవులు కట్ట బెట్టడంలో రాజకీయ పార్టీలన్నీ మొండికేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు బీసీలకు టిక్కెట్లు
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ అనేక ప్రకటనలు చేస్తుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తామని పలు బహిరంగ సభ ల్లో ప్రకటిస్తూనే మరోవైపు సీనియర్‌ బీసీ నేతలకు ఎన్నికల కమిటీల్లో కీలక బాధ్యతలు నిరాకరిస్తూ.. సరైన గుర్తింపుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంతర్గత కలహాలు, వర్గ విభే దాలు ఆధిపత్య పోరులో కూరుకుపోయి ప్రభుత్వ విధా నాల వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రజల్లో విశ్వాసం నింపడంలో విఫలం కావడం శోచనీయం.
కాంగ్రెస్‌ బీసీ పాలసీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. బీసీ అభ్యర్థులకు 40% రిజర్వేషన్లు పెంచే ఆలో చన కూడా పార్టీలో ఉంది. ప్రతి పార్లమెంట్‌ స్థానంలో బీసీ అభ్యర్థులకు రెండో స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని యోచి స్తోంది. అందుకోసం నియోజకవర్గాల్లో బీసీల సమావే శాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. బీసీ సామా జిక వర్గ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని ప్రకటనలో ప్రకటించారు. గతంలో రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వలేదు. బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వ డంలో కాంగ్రెస్‌ పార్టీ జాప్యం చేసింది. బీసీల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే బీసీ ఓటర్ల విశ్వాసం పొందే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
బీజేపీ బీసీ పాలసీ
రాష్ట్ర బీజేపీ బీసీల సమగ్ర అభివృధికి కట్టుబడి వున్న ట్లు ప్రకటించింది. బీసీలకు సబ్‌ ప్లాన్‌ రూపొందించి సబ్‌ ప్లాన్‌ ప్రకారం వెనుకబడిన తరగతులకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలోని 40 సంఘాలను కేంద్ర బీసీ జాబితాలో చేర్చి, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం, రాష్ట్ర స్థాయి బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా రుణాలు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో బీసీ అభ్య ర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే ప్రతిపాదనలు రావ డంతో బీజేపీ వ్యూహాలు రచించనుంది.
బీఆర్‌ఎస్‌ బీసీ పాలసీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ బీసీల సంక్షే మం కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోం ది. బీసీ వర్గాల ఓట్లను కాపాడుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటన చేశారు. బీసీ సంఘా లను ఆకర్షించేందుకు బీసీ ఆత్మీయ సమావేశాలు నిర్వహి స్తున్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల అభివృద్ధి కోసం సద స్సులు నిర్వహించి ప్రగతి పథకాలను ప్రచారం చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి, బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణా ల మంజూరు, గొర్రెల పంపిణీ పథకాల ద్వారా బీసీ ఓట ర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యంత్రాలు, పని ముట్ల కొనుగోలుకు రూ.లక్ష నగదు సాయం అందజేస్తా మని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీసీలు ఆర్థిక సహా యం కోసం ఇప్పటివరకు 5.28 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు.
ఇందుకోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయం ప్రతి నియోజక వర్గంలో 300 మందికి మాత్రమే పరిమితం. అందరికీ పథ కం వర్తింపచేయాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి సంక్షే మం జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆశిద్దాం.
కుల గణనతోనే బీసీలకు న్యాయం
బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు రాజకీయ సాధికారత కల్పించాలని బీసీ నేతలు డిమాండ్‌ చేస్తు న్నారు. కుల గణన చేపట్టడంలో రాజకీయ పార్టీలు అధి కార పార్టీ అవలంబిస్తున్న దంద్వ రాజకీయ వైఖరి విడ నాడి అంబేడ్కర్‌ ఆశించిన బడుగు బలహీన వర్గాలు బహు జనులు వెనుకబడిన తరగతులకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు రిజర్వేషన్స్‌ పెట్టినపుడు మాత్రమే వారికి న్యాయం సిద్ధిస్తుంది. బీసీ లకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం తగిన ప్రాతినిధ్యం ఉండేట్లు చట్టసభల్లో రిజర్వేషన్స్‌ ప్రవేశపెట్టే బీసీ బిల్లు చట్టరూపం దాల్చినపుడు మాత్రమే రాజ్యాధికా రంలో సముచిత వాటా లభిస్తుంది.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలి
కేంద్ర రాష్ట్ర స్థాయి మంత్రివర్గంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలి. ప్రభుత్వాలు బీసీల అభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా భావించాలి. చట్ట సభల్లో బీసీ రిజ ర్వేషన్స్‌ వల్ల బీసీల ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. బీసీ లకు సాధికారత కల్పించాలంటే దేశములో రాష్ట్రంలోని అన్ని జాతీయ ప్రాంతీయ ఉప ప్రాంతీయ రాజకీయ పార్టీ లు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలి. బీసీ కులగణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యో గ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొం దించాలి. ప్రతి రాజకీయ పార్టీ ప్రతికుల సంఘాల నాయ కులతో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలు సేకరించి కులాల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించాలి. బీసీల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన పథ కాలపై సదస్సులు నిర్వహించి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాలి. బీసీ ఓటు బ్యాంకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు మాత్రమే గాకుండా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించి బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృధి ద్వారా సుస్థిర ఆర్థికాభివృద్ధి వ్యూహాలు రూపొందించి సంక్షేమానికి ఆర్థిక స్వావలం బనకు పూనుకోవాలి
నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News