Sunday, October 6, 2024
HomeNewsYash: 700 మందితో వేర్వేరుగా సెల్ఫీలు.. నువ్వు గ్రేట్ బాస్!

Yash: 700 మందితో వేర్వేరుగా సెల్ఫీలు.. నువ్వు గ్రేట్ బాస్!

- Advertisement -

Yash: సాధారణంగా సినిమా సెలబ్రిటీలంటే బయటకి వస్తే భారీ హంగామా ఉంటుందనే సంగతి తెలిసిందే. చుట్టూ బాడీ గార్డ్స్ తో పాటు.. అసిస్టెంట్లు అభిమానులను హీరోల దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుపడతారు. కొందరు హీరోలు ఒకరిద్దరు అభిమానులకు సెల్ఫీలు ఇస్తుంటారు. ఇంకా ఎక్కువగా అభిమానులు గుమిగూడితే సెలబ్రిటీలు అక్కడ నుండి జంప్ కావడం పక్కా.

అయితే, కేజేఎఫ్ హీరో యష్ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మందికి సెల్ఫీలు ఇచ్చాడు. అది కూడా ఒక్కొక్కరికి వేర్వేరుగా 700 సార్లు ఫోటోలకు ఫోజులిచ్చాడు. బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్ లో అభిమానులు యష్ తో ఫోటోల కోసం పోటీపడ్డారు. గ్రూప్ ఫోటోలు దిగాలని నిర్వాహకులు సూచించినా అభిమానుల కోరిక మేరకు యష్ మాత్రం వేర్వేరుగా సెల్ఫీలు దిగాడు.

ఈ సెల్ఫీలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలైన సూపర్ స్టార్ యష్ మాత్రమేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. యష్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్న ఫ్యాన్స్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే కాకుండా తనను స్టార్ ను చేసిన అభిమానుల కోసం ఎంతో ఓపికగా సెల్ఫీలు ఇవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News