చేర్యాల సర్కిల్ పరిధిలోని కొమరవెల్లిలో బుధవారం రాత్రి జరిగిన చోరీ, హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం సాయంత్రం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి గ్రామానికి చెందిన గౌలికర్ లక్ష్మీబాయి తన చిన్న కూతురుని బుధవారం హైదరాబాదులోని అత్తవారింట్లో దించి తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు కొమురవెల్లి కమాన్ నుండి కొమురవెల్లి గ్రామానికి వెళ్లే ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటో డ్రైవర్, తను ఒక్కరే ప్రయాణికులు ఉండగా కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో మరో ముగ్గురు వ్యక్తులు ఆటో ఎక్కి కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత తన మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును తెంచి, గొంతు నులుముతుండగా కొమురవెల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఆటోను కాలువ వైపు తిప్పగా లక్ష్మీ బాయ్ ఆటో నుంచి క్రింద జారిపడి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న ఏర్పుల అరవింద్, పబ్బోజు వెంకటేష్, లింగంపల్లి రవీందర్, మాసంపల్లి కరుణాకర్ అనే వ్యక్తులు గమనించి ఆటో డ్రైవర్ని పట్టుకొని కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చినట్లు తెలిపారు. నిందితుడు గణేష్ నుండి లక్ష రూపాయల విలువ గల రెండు తులాల బంగారు పుస్తెల తాడును రికవరీ చేశామని, పరారైన నిందితులు సాయికుమార్, రమేష్, గురువారం రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో అరెస్టు చేశామని పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులు చేర్యాల సర్కిల్ లో పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే వందకు డయల్ చేయాలని సిఐ సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కొమరవెల్లి ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.
Cheryala: చోరీ, హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
శరవేగంగా నిందితుల అరెస్ట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES