ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నమాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశాను అదే నిబద్ధతతో గౌరవెల్లి ప్రాజెక్టు గోదావరి జలాలతో నింపి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని మాట ఇస్తున్నా అంటూ హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితెలా సతీష్ కుమార్ అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని వెంకటసాయి గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…..
అన్ని వర్గాల సంక్షేమమే సీయం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నమాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశాను అదే నిబద్ధతతో గౌరవెల్లి ప్రాజెక్టు గోదావరి జలాలతో నింపి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని మాట ఇస్తున్న అని స్పష్టం చేశారు. నేను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి ఇల్లు తిరుగుతాను అని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి చూసి సహించలేని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, నేను హుస్నాబాద్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్న నియోజకవర్గ గడ్డమీద ఎగిరేది బీఆర్ఎస్ జెండా గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం మనపై ఉంది బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు.అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అని సవాల్ చేశారు.నా బీఆర్ఎస్ కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారని ప్రతిపక్షాలను హెచ్చరించారు, ఎలక్షన్ ముందు టూరిస్టుల లాగా వచ్చే ప్రతిపక్ష నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు.
కరోనా కాలంలో కరోనా బారిన పడి చావు అంచుల దాకా పోయాను మూడు రోజులు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని డాక్టర్లు చేతులెత్తేశారు కానీ నా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ప్రేమతో మళ్లీ నేను పునర్జన్మ పొందాను నా ఈ జీవితం ప్రజాసేవకు అంకితం అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పిటిసి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు వార్డు మెంబర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.