Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Rite decision in right time: సరైన సమయంలో సరైన నిర్ణయం

Rite decision in right time: సరైన సమయంలో సరైన నిర్ణయం

సంచలనం సృష్టించిన కేంద్ర నిర్ణయం

భారత వాణిజ్య విధానం ఒక్కసారిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గత 3వ తేదీన లాప్ ట్యాప్ లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్లు, సర్వర్ల దిగుమతిపై హఠాత్తుగా నిషేధం విధించడం సంచలనం రేకెత్తించింది. వీటిని భారతదేశంలోకి పంపాలన్న పక్షంలో దిగుమతిదార్ల దగ్గర తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ఈ నిషేధాలు వెనువెంటనే అమలులోకి రావడంతో సరఫరాలు ఆగిపోవడం, స్వదేశంలో వీటి ధరలు పెరగడం లేక కొరత ఏర్పడడం వంటివి జరిగే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం భారత్ కు రవాణా అవుతున్న ఈ పరికరాల పరిస్థితి ఏమిటో అంతుబట్టకుండా ఉంది. ముఖ్యంగా దేశంలో ఇది పండుగల సీజన్ అయినందువల్ల వీటి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

- Advertisement -

కాగా, కేవలం భద్రతా కారణాలపై ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని భారత ప్రభుత్వం చెబుతోంది. దిగుమతి అయిన పరికరాల వల్ల నిఘా ప్రమాదం ఎక్కువవుతోందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. సెల్ ఫోన్లలో స్పైవేర్ ను ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైన
ఐ.టి హార్డ్ వేర్ ఉత్పత్తిదారులు భారతదేశంలోనే తమ పరికరాలను ఉత్పత్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇందుకు అనేక విధాలైన ప్రోత్సాహకాలు ఇస్తామని, రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ప్రధాన ఉత్పత్తిదారులెవరూ ముందుకు రావడం లేదు. అయితే, సాఫ్ట్ వేర్ సంస్థలు రాత్రికి రాత్రి ఇక్కడ తమ యూనిట్లను ప్రారంభించడమన్నది సాధ్యమయ్యే విషయం కాదు. ఇక దేశీయ సాఫ్ట్ వేర్ రంగం ఎగుమతులను, ఐ.టి సర్వీసుల ఎగుమతులను కూడా ఇది దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం దీని వల్ల తాము నష్టబోయే ప్రమాదం ఉందని గ్రహించే ఈ నిషేధాన్ని నవంబర్ 1 వరకూ పొడిగించినట్టు కనిపిస్తోంది. ఈ లోగా దిగుమతుల లైసెన్సులను సంపాదించుకోవాలని ప్రభుత్వం సూచించింది. లైసెన్సులు అవసరం అని చెప్పినంత మాత్రాన ఇది లైసెన్సుల రాజ్యంగా మారబోవడం లేదని కూడా ఇది వివరించింది.

ఒకవేళ త్వరితగతిన దిగుమతి లైసెన్సులను మంజూరు చేసినప్పటికీ, కొద్ది కాలం పాటైనా భారతదేశ ఐ.టి పరిశ్రమ పరిస్థితి 1970లు, 80ల నాటికి స్థాయికి వెళ్లిపోయే అవకాశం ఉంది. లైసెన్సుల పరిస్థితి చక్కబడి, భారత్ లో యూనిట్లు ప్రారంభం కావడానికి చాలా కాలం పడుతుందనడంలో సందేహం లేదు. దిగుమతిదార్లు తమ దిగుమతులు సరైనవేనని నిరూపించుకోవాల్సి ఉంటుందా? ఇతరుల కంటే తక్కువ
ధరలకు నాణ్యమైన పరికరాలు అందజేస్తామని నిరూపించుకోవాల్సి ఉంటుందా? ఎవరిని లేదా ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటాం, ఎవరికి ఎగుమతులు చేస్తాం అని చెప్పుకోవాల్సి ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంటుంది. 2022-23లో కంప్యూటర్లు, టా బ్లెట్ల దిగుమతులు 28 శాతం, అంటే 530 కోట్ల డాలర్ల వరకు తగ్గిపోయిన మాట నిజం. అంతేకాక, ఇవి చైనా నుంచి దిగుమతి అవుతున్నందువల్లే భద్రతకు సంబంధించిన ఆందోళన కలుగుతోంది.

అదే నిజమైతే, రవాణా సమయంలోనే వీటిని పరీక్షిస్తే సరిపోతుంది. పెట్టుబడులు పెంచడమే లక్ష్యంగా ఈ నిషేధాలు విధించినట్టయితే, ఈ విధంగా ఒత్తిడి తీసుకు వచ్చి, బెదరించి ప్రధాన సంస్థల నుంచి పెట్టుబడులు సంపాదించడం జరిగే పని కాదు. ఈ సంస్థలు మరేదైనా దేశాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. అవి ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకున్నా, ఈ పరికరాల విషయంలో భారత్ ఆశించిన
ఫలితాన్ని సాధించలేకపోయినా దెబ్బతినేది భారతీయ వినియోగదార్లే. డిజిటల్ ఇండియాలో ప్రతిదీ ఆన్ లైన్ లో జరుగుతున్నందువల్ల, ఈ పరిస్థితుల్లో ఐ.టి రంగానికి ఏమాత్రం నష్టం వాటిల్లినా ప్రభుత్వ ధ్యేయం దెబ్బతింటుంది. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది.
సంస్కరణల వైపు పరుగులు పెడుతున్న భారతదేశం సమస్యలపాలయ్యే అవకాశం కూడా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News