Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Father of Indian space research Vikram Sarabhai: భారత అంతరిక్ష విక్రముడు విక్రమ్‌...

Father of Indian space research Vikram Sarabhai: భారత అంతరిక్ష విక్రముడు విక్రమ్‌ సారాభాయ్‌..!

అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రం సారాబాయి జయంతి


చంద్రయాన్‌ 3 విజయవంతంగా పూర్తవ్వడానికి మరికొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. విజయ సంబరాలు ఇక లాంఛనం మాత్రమే. ఎంతటి సుదూర ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఈ తొలి అడుగుకు మూల పురుషుడు, అంతరిక్ష కార్యక్రమ పితామహుడు, భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ జయంతి నేడే. ఈయన పూర్తి పేరు విక్రమ్‌ అంబాలాల్‌ సారాభాయ్‌. అహ్మదాబాద్‌ నగ రంలో ధనిక జైన వ్యాపార కుటుంబానికి చెందిన అం బాలాల్‌, సరళా దేవి దంపతులకు ఎనిమిదవ సంతా నంగా 1919 సంవత్సరం ఆగస్ట్‌ 12వ తేదీన జన్మిం చారు. గుజరాత్‌ కళాశాలలో ఇంటర్మీడయట్‌ విద్య సైన్సులో పూర్తైన తరువాత ఉన్నత విద్యను అభ్యసిం చడానికి ఇంగ్లాండ వెళ్ళారు. అక్కడ ఉన్న సెయింట్‌ జాన్స్‌ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం నుండి 1940 సంవత్సరంలో నేచురల్‌ సైన్సులో ట్రిపోస్‌ (నేటి డిగ్రీతో సమానం) అందుకున్నాక, రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరం కావడంతో భారతదేశా నికి తిరిగి వచ్చి బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరారు. ఇక్కడే నోబెల్‌ బహు మతి గ్రహీతైన సర్‌ సివి రామన్‌ మార్గదర్శకత్వంలో కాస్మిక్‌ కిరణాలపై పరిశోధన ప్రారంభించారు. యుద్ధం ముగిసిన తరువాత 1945 సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జిలో చేరి, 1947 సం.లో ఈ విశ్వ విద్యా లయం నుండి ఉష్ణమండల అక్షాంశాలలో కాస్మిక్‌ కిరణాలు (కాస్మిక్‌ రే ఇన్వెస్టిగేషన్‌ ఇన్‌ ట్రాఫికల్‌ లాటిట్యూడ్స్‌) అనే అంశంలో పరిశోధనకు గాను పి.హెచ్‌.డి పట్టా అందుకున్నాక, స్వతంత్ర భారత దేశానికి వచ్చి నవంబర్‌ 11, 1947న అహ్మదాబాద్‌ లో ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీని స్థాపించారు.
సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో మరియు జాతీయ అభివృద్ధిలో అంతరిక్ష సాంకేతికత అర్ధవంతమైన పాత్రను పోషిస్తుందనే నమ్మకంతో, డాక్టర్‌ విక్రమ్‌ ఎ. సారాభాయ్‌ 1960లో ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాన్ని సామాన్యు లకు అందబాటులోకి తీసుకువచ్చేటప్పుడే దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతుందని తద్వారా దేశంలోని ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చనే దూర దృష్టితో అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాడు. 1957లో రష్యా మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించిన తరువాత మన దేశానికి కూడా ఉప గ్రహ ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ జహంగీర్‌ బాబా పర్యవే క్షణలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ (ఇన్‌కోస్పార్‌ – ఐ.ఎన్‌.సి.ఒ.ఎస్‌.పి.ఎ.ఆర్‌)ను ఏర్ప రచాడు. భూ అయస్కాంత భూమధ్య రేఖకు సామీ ప్యత గల ప్రాంతం మరియు ఉపగ్రహాలు మోసుకెళ్ళ డానికి అవసరమైన రాకెట్లను ప్రయోగించడానికి వీల య్యే ప్రదేశముగా అరేబియా సముద్ర తీరంలో తిరు వనంతపురంకి సమీపంలో ఉన్న తుంబ ప్రాంతం అవుతుందని గుర్తించి మొట్టమొదటి రాకెట్‌ లాం చింగ్‌ స్టేషన్‌ గా తుంబాని ఈయన ఎంచుకున్నారు. సోడియం ఆవిరి పేలోడ్‌తో మొదటి రాకెట్‌ను నవం బర్‌ 21, 1963న ప్రయోగించారు. 1965లో ఐక్య రాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఈ ప్రాంతానికి అంత ర్జాతీయ సదుపాయంగా గుర్తింపునిచ్చింది. భవిష్యత్తు లో ఇతర దేశాలు ఉపగ్రహాలకి అవసరమయిన అన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రం సారాభాయ్‌, ఉపగ్రహానికి అవసరమయిన అన్ని విడి భాగాలనూ దేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. 1969, ఆగస్టు 15 నాడు ఇన్‌కోస్పార్‌ ఇస్రోగా రూపొందింది. 1972లో ప్రత్యే క అంతరిక్ష విభాగం ఏర్పడింది. కేవలం ఉపగ్రహా లను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయో గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్య కతను గుర్తించిన సారాభాయ్‌, ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన మొదలు పెట్టాడు. అలా తయారైనదే సెటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌. ఈయన చాలా పరిశోధన సంస్థలు నెలకొల్పడమే కాకుండా అనేక జాతీయ సం స్థలు స్థాపనకు కారణమయ్యారు. వాటిలో కొన్ని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ – అహ్మదా బాద్‌, దర్పన్‌ అకాడమీ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్‌ – అహ్మదాబాద్‌, ఫాస్ట్‌ బ్రీడర్‌ టెస్ట్‌ రియాక్టర్‌ – కల్పకం, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా – హైదరా బాద్‌, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ – జాదుగూడ మొదలగునవి ఉన్నాయి. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయ నను 1962లో శాంతి స్వరూప్‌ భట్నగర్‌ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. సారాభాయ్‌ 1971 డిసెంబరు 30 న మరణించారు.

  • డీ.జే. మోహన రావు
    9440485824
    (నేడు అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ జయంతి)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News