Saturday, November 23, 2024
HomeతెలంగాణKale Yadayya: గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కేసీఆర్ ధ్యేయం

Kale Yadayya: గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కేసీఆర్ ధ్యేయం

కేసీఆర్ ను మూడోసారి గెలిపించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రెండో విడత గొర్రెల పంపిణీ చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పాల్గొన్నారు. శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో గొల్ల కురుమలకు 6 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ గొల్ల, కురుమల జీవితాల్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుదల కోసం గొల్ల, కురుమల అభివృద్ధే ధ్యేయంగా గొర్రెల పంపిణీ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గొల్ల కురుమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప కార్యక్రమమే గొర్రెల పంపిణీ పథకం అన్నారు. తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గమనిస్తూ కల్వకుంట్ల చంద్రశేఖర రావుని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, పొద్దుటూరు గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి ,ఎంపిటిసి ప్రవళిక వెంకట్ రెడ్డి, మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడా నరసింహారెడ్డి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News