వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనిలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హనుమన విగ్రహం, ధ్వజస్తంభం, నవగ్రహాలు, ఒంటెవహణం, శిఖరం ప్రతిష్టాపన కార్యక్రమాలు పురోహితుల మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకన్న గౌడ్, ఆలయ చైర్మన్ సాయప్ప మాట్లాడుతూ… ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా మూడు రోజుల నుండి దగ్గరుండి యజ్ఞాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందించిన రాజీవ్, ఇందిరమ్మ కాలనీ యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 12 తేదీ వరకు 3 రోజులపాటు రాజీవ్ కాలనిలో పూజా కార్యక్రమాలు హౌమాలు నిర్వహించారు.
భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ఎంతో ఉత్సవంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ టి.సాయప్ప, అధ్యక్షులు మునేందర్, ఉపాధ్యక్షులు సి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, కోశాధికారి భద్రేశ్వర్, సహాయక కార్యదర్శి ప్రళద్ జాధవ్, సభ్యులు నర్సింలు, సంజీవ్, వెంకటరెడ్డి, ప్రశాంత్, ఎలామంద, సాయి కృష్ణ, దిలీప్ గౌడ్, మహేష్ రెడ్డి, సుందర్ , నిరంజన్ గౌడ్ , అమర్నాథ్, ప్రశాంత్ రెడ్డి, శాంతు పటేల్, సాయి పవర్, రోహిత్ సుగంధి, రమేష్, గోవర్ధన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.