Saturday, October 5, 2024
HomeతెలంగాణMulugu: పోలీస్ కానిస్టేబుల్ లకు ధైర్య సాహసాల అవార్డు

Mulugu: పోలీస్ కానిస్టేబుల్ లకు ధైర్య సాహసాల అవార్డు

వరదల్లో ప్రాణాలకు తెగించి, తెగువ చూపి సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

ఇటీవల ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద బాధితులను కాపాడడంలో ధైర్య సాహసాలు చూపిన ఇద్దరు కానిస్టేబుల్ లకు రాష్ట్ర ప్రభుత్వం ధైర్య సాహసాల అవార్డు ప్రకటించింది. ములుగు జిల్లాలో గత జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు కుంటలు చెరువులు వాగులు, వంకలు పొంగి పొర్లగా ఆకస్మికంగా వరదల్లో అనేక గ్రామాలు, గుత్తి కోయగూడాలు, పశువులు వరద నీటిలో చిక్కుకుపోగా ప్రజలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టారు. ఈ సందర్భంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ధైర్య సాహసాలతో ప్రకృతిని సైతం ఎదిరించి వరదల్లో చిక్కుకున్న అనేక మంది ప్రాణాలను కాపాడిన ములుగు జిల్లా పోలీస్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలోని ఇద్దరు కానిస్టేబుల్ జి. రాంబాబు, కె. శ్రీకాంత్ ల ఈ అవార్డు దక్కింది.

- Advertisement -

ప్రస్తుతం వీరు స్పెషల్ పార్టీలో విధులు నిర్వహిస్తుండగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం గారిచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా విపత్తు ప్రతిస్పందన బృందంలో అదనంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రిచే వీరిద్దరూ రివార్డ్ అందుకోనున్నారు. ధైర్య సాహసాల అవార్డు దక్కించుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News