Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: చేనేతని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తాం

KTR: చేనేతని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తాం

పోచంపల్లిలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి పర్యటన

భూదాన్ పోచంపల్లి లో ఈరోజు నేతన్న విగ్రహావిష్కరణ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఐటీ, పురపాలక, చేనేత జౌలి శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత ఇంటిగ్రేటెడ్ యూనిట్ ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తరువాత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. తదనంతరం దంతూరు కనుముక్కల గ్రామాల మధ్యలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ పార్క్ ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోచంపల్లిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

రెండు కోట్ల మంజూరు అయిన దోబీఘాట్, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మార్కెట్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి లోని ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఐటి పురపాలక మరియు చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మూతపడే స్థితికి వచ్చిన హ్యాండ్లూమ్ పార్క్ నీ మరలా అభివృద్ధి చేసి పునరుదించాలని మంత్రి కేటీఆర్ ని కోరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పరుస్తున్నది మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అలాగే చేనేత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.


మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఐటీ పురపాలక మరియు చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పోచంపల్లి కి రావడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేతన్న విగ్రహాన్ని చక్కగా రూపొందించారని అన్నారు, చేనేత కళాకారుల మరియు చేనేత కార్మికుల గురించి మాట్లాడుతూ నరాలని పోగులుగా చేసి రక్తాన్ని రంగులుగా మార్చి గుండెల్ని ఖండేలుగా చేసి చెమట చుక్కల్ని చీర లాగా మార్చి పేగులని వస్త్రాలుగా చేసి మనిషికి నాగరికత అద్దిన గొప్ప కళ చేనేత కళాకారులు మరియు కార్మికులు ది అని వారందరికీ నా నమస్కారాలని తెలిపారు. నేతన్నకు ప్రతీక మగ్గం అని చేనేత కళాకారుల కష్టం చేనేత కార్మికుల బాధ దగ్గరగా చూసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందుకే చేనేత మిత్ర పేరుతో 50% సబ్సిడీ నూనె మీద రసాయనాల మీద ఇవ్వడమే కాకుండా చేనేత కార్మికుల కోసం నేతన్న బీమా తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.అదేవిధంగా చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ద్వారా3000 రూపాయల భృతి అందజేయడం కూడా జరుగుతుంది అని తెలిపారు అంతేకాకుండా ఇంతకుముందు ప్రారంభించిన హ్యాండ్లూమ్ పార్క్ ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉందని దానిని పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఉపయోగపడేలా చేస్తామని అంతేకాకుండా దానిపై వచ్చినటువంటి లాభాన్ని కూడా ప్రతి పైసా పోచంపల్లికి సంబంధించిన చేనేత కార్మికులకు అందేటట్లుగా చేస్తామని తెలిపారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీలు చేనేతపై అవలంబించినటువంటి చర్యలు చాలా హేయమైనవని కేంద్రంలో ఇలాంటి క్రూరమైన బిజెపి ప్రభుత్వం మనకు అవసరం లేదని అందుకే మీరందరూ బిజెపిని రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.అదేవిధంగా పోచంపల్లి మున్సిపల్ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్,నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ చింత ప్రభాకర్,పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ చైర్మన్ గుండు ప్రవీణ్ ,ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి,జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి,పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు పార్టీ సుధాకర్ రెడ్డి,ఎంపీటీసీలో ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం,శివ రెడ్డి గూడెం సర్పంచ్ పెసర్ల మంజుల మహిపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ భాస్కర్ లింగస్వామి,కౌన్సిలర్లు గుండు మధు,కర్నాటి రవీందర్,సామల మల్లారెడ్డి,దేవరాయ కుమార్,పెద్దల చక్రపాణి,కుడికాల అఖిల బలరాం,భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డమోని చంద్రం యాదవ్, ముత్యాల మైపాల్ రెడ్డి,పోచంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిలువేరు బాల నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి,పోచంపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీత వెంకటేష్,ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్,ఉపాధ్యక్షుడు చేరాల నరసింహ, జింకల యాదగిరి కార్యదర్శి సీతా శ్రావణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు తంగెళ్ళ దశరథ,ఎడ్ల లింగస్వామి,బిఆర్ఎస్ పార్టీ యువజన జిల్లా నాయకులు చింతకింది కిరణ్,వేముల సుమన్ గౌడ్,నోముల ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News