Friday, September 20, 2024
HomeతెలంగాణVinod Kumar: అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'తెలుగు ప్రభ'

Vinod Kumar: అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘తెలుగు ప్రభ’

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిజాలని నిక్కచ్చిగా పత్రికా ద్వారా ప్రజల దృష్టికి తీసుకు వస్తున్న తెలుగు ప్రభ దినపత్రిక అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యం రూపొందించిన ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత… దేశానికి దిక్సూచి కేసీఆర్ పుస్తకాలను ఆదివారం తెలుగు ప్రభ దినపత్రిక కరీంనగర్ బ్యూరో గోల్లే రామస్వామి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ… అనతి కాలంలోనే తెలుగు ప్రభ దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందిందని నిజాలను నిస్సంకోశంగా వార్తల రూపంలో ప్రచురించడంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అలాంటి సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరిస్తూ లబ్ధిదారుల అభిప్రాయాలతో పుస్తకాలను రూపొందించడం ఒక తెలుగు ప్రభ దినపత్రికకే సాధ్యమైందన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో తగు పాత్ర పోషించాలని ఇట్టి విషయంలో తెలుగు ప్రభ దినపత్రిక ముందుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కా రెడ్డి, గంగాధర ఎంపీపీ శ్రీరామ్ మధుకర్, మేనేని నవీన్ రావు కురిక్యాల సర్పంచ్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ,సాగి మైపాల్రావు సింగిల్ విండో మాజీ చైర్మన్, రిటైర్ జాయింట్ కలెక్టర్ బైరం పద్మయ్య, మాజీ ఏఎంసి చైర్మన్ తిరుమలరావు, మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News