ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేట డివిజన్ పొట్టి శ్రీరాములు నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్ వెల్ ను మంత్రి ప్రారంభించారు. కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పవర్ బోర్ వెల్, ట్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బోర్ వెల్ లో నీటి సమస్య పరిష్కారం అయినట్లేనని అన్నారు. కాలనీ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తాను నిరంతరం ప్రజల మధ్యనే ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, వాటర్ వర్క్స్ సీజీఎమ్ ప్రభు, డివిజన్ అద్యక్షుడు వెంకటేష్ రాజు, పద్మారావు నగర్ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తలసాని. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్ లు, పార్క్ ల అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి వంటి పలు అభివృద్ధి పనులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్,కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, టి.మహేశ్వరి,హేమలత, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప,అత్తిలి అరుణ,డివిజన్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాజు,హన్మంతరావు, పవన్ కుమార్ గౌడ్, నాయకులు పిఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.