Sunday, September 29, 2024
HomeతెలంగాణRema Rajeswari: ఆదివాసీల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం

Rema Rajeswari: ఆదివాసీల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం

ప్రజల సమస్యలు, అవసరాల, భద్రత కోసం పోలీసులు సదా మీ సేవలో..

పోలీసుల ఆధ్వర్యంలో 31 ఆదివాసి గూడెంలోని ప్రజలకు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి సహకారంతో మంచిర్యాల జిల్లా లక్షేట్ పేట మండలం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షేట్ పోలీస్ సర్కిల్ పరిధిలోని 31 గూడెంల ప్రజల కోసం కర్ణ పేట గ్రామం రైతు వేదిక వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., డిఐజి., ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొదట సీపీని పోలీస్ అధికారులను ఆదివాసీ ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు, గుస్సాడి నృత్యంతో స్వాగతం పలికారు.

- Advertisement -

సీపీ మాట్లాడుతూ… మీరు మా పోలీస్ వారికి పలికిన ప్రేమ పూర్వక స్వాగతం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. పోలీస్ ఎల్లప్పుడూ మీకోసం మీకు అందుబాటులో ఉంటుందని ఇందులో భాగంగా ఈ రోజు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి మారుమూల ఉన్న గ్రామాల నుండి ప్రజలు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందిగా ఉండడం గమనించి ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు పాథలాజికల్ డయాగ్నస్టిక్ సేవలు, ఇమేజింగ్ సేవలను అందించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ (టీ హబ్) లో భాగంగా అందుబాటులో ఉన్న సీబీపీ, ఇఎస్సార్, ఆర్బీస్, అరేఫ్టీ, యూఅర్ఎస్సి ఆసిడ్, ఎల్ఎఫ్టి, లిపిడ్, ప్రొఫైల్, కాల్షియమ్, హాబైక్, థైరాయిడ్, ప్రొఫైల్, ఎస్సైవో, ఆరఫ్ ఫ్యాక్టర్, సీఆర్పీ, చికెన్ గుణ్యా, అర్పిర్ ఇట్టి టెస్ట్ లు వైద్య శిబిరంలో నిర్వహించారు.

అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సంబందించిన సమస్యలపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ మారుమూల ప్రాంతం యువత ఉద్యోగ, ఉపాధి కోసం మీ యొక్క శిక్షణ కోసం, అభివృద్ధిలో మా పరోక్ష, ప్రత్యక్ష పాత్ర ఉండాలనే ప్రధాన ఉద్దేశం తో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులకు కాంపిటేషన్ కోసం బుక్స్ అందచేశామన్నారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆర్టిఓ వివేకానంద రెడ్డి సహాయంతో ఉచితంగా మారుమూల ప్రజలు, యువత కోసం ఫ్రీ లైసెన్స్ క్యాంపును ఏర్పాటు చేశారు. 250 మంది లైసెన్స్ కోసం ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వీరికి ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ పై అవగాహన కలిపించారు. 1000 మందికి బ్లాంకెట్స్, 250 మంది మహిళలకు చీరలు అందచేశారు. యూనియన్ బ్యాంక్ అధికారుల సహాయంతో అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఆర్థిక అంశాల పై అవగాహన, సైబర్ నేరాలపై, ఇన్సూరెన్స్ స్కీమ్ లపై అవగాహన కల్పించారు.

ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోరకు కమ్యూనిటీ పోలిసింగ్, ద్వారా ఈ మెగా వైద్య శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కర్ణపేట్ గ్రామ పంచాయతీల పరిధిలోని పెండ్లిమడుగు, రేగు గూడ సామగుడా, గుండగూడెం, అర్జుగూడ, తానిమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని బెహరామ్ గూడా కుందేళ్ళ పహాడ్, కొరివి చెల్మా గ్రామ పంచాయతీ పరిధిలోని, నాయకప్ గూడ కొరవి చెల్మా, మాదరి పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని పర్ధనగూడా, అందుగుల పేట లక్ష్మి కాంతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిక్కనగూడా,. లింగాపూర్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడ బిలకులగూడ, అల్లిపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోండు గూడ, మొకసాయిగూడ, మాకులపేట గ్రామపంచాయతీ పరిధిలోని కోయపోచగూడ, గోండ్ గూడ నాయకపు గూడ, మొకసాయిగూడ, నాగసముద్రం పంచాయతీ పరిధిలోని గోండు గూడ రాజుగూడా గ్రామపంచాయతీ పరిధిలోని కుంట్ల గూడక కట్ట, పోచం గూడ, జైతురు గూడ, తాట్రాపొచం గూడ, రాజు గూడ,
కొత్త మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దమ్మన్నపేట పాత మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్ల, కంచరబాయి, రెబ్బనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగూడ, వదురుగూడా పంచాయతీ పరిధిలోని వందుర్గుడా, నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సాపూర్ (గోండు గూడ) మొత్తం 31 గూడెంల ప్రజలు వైద్య సేవలను సుమారు 1100 మంది వినియోగించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచితగా వైద్య పరీక్షలు చేసి మందుల పంపిణి చేశారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు భోజన ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్ ఐపీఎస్., అడిషనల్ కలెక్టర్ రాహుల్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ హుల్ హాక్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ మల్లికార్జున, లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్, దండేపల్లి ఎస్సై ప్రసాద్, లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్, డాక్టర్స్ బృదం శ్రీధర్ రెడ్డి కార్డియాలజిస్ట్ హైదరాబాద్,మెడి లైఫ్ హాస్పిటల్ డాక్టర్స్, డాక్టర్ చేతన్ – జెన్ మెడిసిన్,డాక్టర్ కుమార్ – ఛాతీ వైద్యుడు, డాక్టర్ జి.శ్రీనివాస్ – క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్,డాక్టర్ ప్రసన్న – గైనకాలజీ, డాక్టర్ షాలిని – మైక్రోబయాలజిస్ట్,డాక్టర్ ఎస్.శ్రీనివాస్ -రేడియాలజిస్ట్, డాక్టర్ జయభారతి – అనస్థీషియా, డాక్టర్ శ్రీధర్ – ఆర్థో, డాక్టర్ శ్రీధర్-కంటి నిపుణుడు, డాక్టర్ స్వప్నిక – డెంటల్,డాక్టర్ లక్ష్మణ్ – న్యూరో సైకియాట్రిస్ట్, డాక్టర్ మధన్- ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గుణవతి-ఈఎన్‌టీ, డాక్టర్ కీర్తి-OBG, డాక్టర్ బహను ప్రకాష్- మెడికల్ ఆఫీసర్, డాక్టర్ క్రాంతికుమార్- మెడికల్ ఆఫీసర్,డాక్టర్ సతీష్- మెడికల్ ఆఫీసర్, డాక్టర్ అబిగ్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూష- మెడికల్ ఆఫీసర్, డాక్టర్ రాజు-ఎమ్.ఎల్.హెచ్.పి – మెడికల్ ఆఫీసర్, వైద్య సహాయక సిబ్బంది, రాము పటేల్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News