Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Gangula: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Gangula: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

'గడప గడపకు'లో ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 2వ సచివాలయం పరిధిలోని 26, 27 వ వార్డు దేవరాయపురంలోని తూర్పు వీధి, మంగలి వీధి, చాకలి వీధి, ఎస్సీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రా రెడ్డి పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఇంకా అర్హత ఉండి అందని వారు ఉంటే తెలపాలని, అలాగే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 98 శాతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అగోగతి పాలు చేశాడని అవకాశం ఉన్నప్పుడు చేయలేనిపనులు కేవలం ఓట్ల కోసం ప్రజలను పక్కదారి పట్టిస్తూకాకాపడుతున్నారన్నారు. ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలన్నీమేమేఅందించామన్నారు. ఆయన మాట్లాడే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఎమ్మెల్యే గంగుల అన్నారు. ప్రజలందరికీ జగన్ అంటే ఒక ధీమా ఉందని చెప్పింది చేస్తాడని నమ్మకం ప్రజలకుఉందన్నారు. అక్కా చెల్లెమ్మలు, అన్నలు, అవ్వ తాతలు అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు చల్లని దీవెనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి , కమిషనర్ ఏవి రమేష్ బాబు, ఆళ్లగడ్డ టౌన్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు సింగం వెంకటేశ్వర రెడ్డి , ఆళ్ళగడ్డ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నర్సింహా రెడ్డి, చింతకుంట వైఎస్సార్సీపీ నాయకులు కౌన్సిలర్ వరప్రసాద్ రెడ్డి , వైకాపా నాయకులు రాజారెడ్డి, శంకర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, పలచాని మల్లికార్జునరెడ్డి ,ఇంజేటీ నాగిరెడ్డి, శివనాగిరెడ్డి, చంద్రా రెడ్డి ఏ ఈలుసురేందర్ రెడ్డి, కంబగిరి, బాలస్వామి, మెప్మావెంకటసుబ్బయ్య, ఏఎస్ఐ మల్లేశ్వర్ రెడ్డి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News