Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభBigg Boss 6: రేవంత్ విన్నర్.. రన్నర్ శ్రీహన్.. ఇదే ఈరోజు ఫైనల్ ఎపిసోడ్!

Bigg Boss 6: రేవంత్ విన్నర్.. రన్నర్ శ్రీహన్.. ఇదే ఈరోజు ఫైనల్ ఎపిసోడ్!

- Advertisement -

Bigg Boss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ఎవరు.. రన్నర్ ఎవరు?.. ఈ సీజన్ టైటిల్ గెలుచుకొనేది ఎవరు?, ప్రైజ్ మనీ ఎవరి సొంతం అవుతుంది. ముందుగా బిగ్ బాస్ ఇచ్చే మనీతో విన్నర్ అయ్యే ఛాన్స్ వదులుకునేది ఎవరు?.. ఇలా నిన్నటి వరకు బిగ్ బాస్ చూసేవాళ్ళకి ఎన్నో ఆలోచనలు.. ఎన్నో అంచనాలు. వాటన్నిటికీ తెరపడింది. గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం అయ్యింది. ఎట్టకేలకి ఈ సీజన్ ముగింపు దశకి చేరుకుంది.

నిజానికి ఈసారి సీజన్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. స్టార్టింగ్ వీక్స్ లోనే రేటింగ్ లేక బిగ్ బాస్ టీమ్ తలలు పట్టుకున్నారు. రివ్యూవర్స్ ని హౌస్ లోకి తీస్కోవడం, పార్టిసిపెంట్స్ సెలక్షన్ బాగోకపోవడం, ఫేమ్ ఉన్నవాళ్లు లేకపోవడం, గేమ్ సరిగ్గా ఆడేవాళ్లు లేకపోవడం అనేది పెద్ద మైనస్ అయ్యింది. మొత్తంగా ఎలాగోలా సీజన్ ముగించిన బిగ్ బాస్ ఈ ఆదివారం ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగించేయనున్నాడు.

ఈ సీజన్ లో మొదటి నుంచి రేవంత్ మీదే అందరి గురి ఉంది. ఇండియన్ ఐడల్.. సింగర్ గా సూపర్ ఫాంలో ఉన్న రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఆ నిమిషమే అతనే విన్నర్ అని కొందరు ఫిక్స్ అయ్యారు. అందుకే ఎక్కువ వారాలు నామినేషన్స్ లో ఉన్నా సరే అతన్ని సేఫ్ చేస్తూ స్ట్రాంగ్ ఓటింగ్ ని చూపించారు.. బిగ్ బాస్ కూడా రేవంత్ ను సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు.

మొదటి వారం నుంచి టాప్ ఓటింగ్ లో ఉన్న రేవంత్.. ఈ సీజన్ 6 లో టాస్కుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన ఒక్క వ్యక్తి కూడా. అయితే, హౌస్ లో తన ఆట తీరు.. మాట తీరుతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న రేవంత్ ఫైనల్ గా ఈ సీజన్ 6 విన్నర్ గా నిలవడం విశేషం. ముందు నుంచి టైటిల్ విన్నర్ తనే అవుతానని బలంగా చెబుతూ వచ్చిన రేవంత్ అనుకున్నట్టుగానే టైటిల్ గెలిచాడు.

ఈ రోజు ఈవెనింగ్ ఆరు గంటల నుంచి ఫైనల్ ఎపిసోడ్ మొదలవుతుంది. రేవంత్ విన్నర్ అవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచాడని తెలుస్తుంది. టాప్ 3లో కీర్తి.. టాప్ 4లో ఆది రెడ్డి.. టాప్ 5 లో రోహిత్ ఉన్నారు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ అఫీషియల్ సైట్‌లో ఎంట్రీ చేశారు షో నిర్వాహుకులు. విన్నర్ గా నిలిచిన రేవంత్ కి రూ.50 లక్షల ప్రైజ్ మనీ, రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్, కారు దక్కించుకోగా.. రన్నర్ అప్‌ శ్రీహాన్‌ కి 5 లక్షల రివార్డ్ అందుకోనున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News