Saturday, October 5, 2024
HomeతెలంగాణSeethakka: ములుగు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

Seethakka: ములుగు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

సమస్యలను ఏకరువు పెట్టిన ఎమ్మెల్యే

ములుగు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిశీలించడానికి చొరువ చూపాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినాను కలిసి, ములుగు, నియోజకవర్గంలోని పలు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ GCC ఉద్యోగుల 2020 పిఆర్ సి, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఇటీవలే కురిసిన వర్షాలకు అనేక గ్రామాల రోడ్లు తెగిపోయాయన్నారు, తెగిపోయిన రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చెయ్యాలని కోరారు. వరద బాధితులకు ఆర్థిక సాయంతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లను సర్కారు మంజూరు చేయాలని కోరారురు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News