Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan: ఈసారి వైసీపీ అధికారంలోకి రాదు.. రానివ్వను!

Pawan Kalyan: ఈసారి వైసీపీ అధికారంలోకి రాదు.. రానివ్వను!

- Advertisement -

Pawan Kalyan: వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాదు.. రానివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. పల్నాడులో జనసేన కౌలురైతుల భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ యాత్రలో మాట్లాడిన పవన్ ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని.. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తానన్నారు.

వైసీపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత నాదన్న పవన్.. వైసీపీ నేతలు మాట్లాడే మాటలన్నీ పనికిమాలిన మాటలేనని.. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని.. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానన్నారు. వాళ్ళు నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత బలంగా పైకి లేస్తానన్న పవన్.. అందుకు జనసైనికులే రక్షగా ఉండాలన్నారు.

ఇక, పవన్ సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో నిర్వహించిన జనసేన కౌలురైతుల భరోసా యాత్ర అనంతరం జనసేనాని.. పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 280 కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఆర్ధిక సాయం చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News