శరీరంలో పేరుకున్న కాలరీలను కరిగించే.. కొవ్వును వేగంగా తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేమిటంటే…
పెసల్లో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో ఫ్యాట్ బాగా తక్కువగా, పీచుపదార్థాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని కొద్దిగా తింటే చాలు కడుపు నిండినట్టు ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.
పచ్చిమిరపకాయలు శరీర బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయపడతాయి. జీర్ణక్రియ వేగం పెంచడం ద్వారా శరీరంలోని కొవ్వును పచ్చిమిరపకాయలు తగ్గిస్తాయి.
మసాలాల్లో క్వీన్ ఏలకులు. ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
కరివేపాకు శరీరంలోని ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్నఅదనపు కొవ్వును సైతం కరిగిస్తుంది.
జీర్ణక్రియను వేగవంతం చేయడం ద్వారా గ్రీన్ టీ శరీర బరువును వేగంగా తగ్గిస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం సహజం. కారణం గ్రీన్ టీలో ఆకలిని తగ్గించే గుణం దాగుంది.