Tuesday, March 11, 2025
Homeపాలిటిక్స్Korukanti Chander: తెలంగాణ ప్రజలకు కొండంత అండ గులాబీ జెండా

Korukanti Chander: తెలంగాణ ప్రజలకు కొండంత అండ గులాబీ జెండా

సీఎం కేసీఆర్ పాలనకు అకర్షితులై బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరికలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గులాబీ జెండా కొండంత అండగా అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం తక్కల్లపల్లి గ్రామంలో మాజీ వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పెద్దపల్లి బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుక్కలగూడూర్ మాజీ సర్పంచ్ పత్తిపాక శంకరయ్య ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడెం దేవేందర్ తోడేటీ శంకర్ గౌడ్ మునీర్ మధునయ్య మధుకర్ దొమ్మేటి వాసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News