KA Paul : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి జగన్‌లపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమేనని, రాష్ట్రం కోసం కాదన్నారు. లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కు మరోసారి పగ్గాలిస్తే ఇబ్బందులు తప్పవన్నారు.
రానున్న ఏపీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ , 25 ఎంపీ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను దింపబోతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 100కి 60 శాతం ప్రజలు తనను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు కేఏ పాల్ చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడని, టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓట్లేస్తే బీజేపీకి ఓట్లు వేసినట్లేనని అన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు విషమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు.
అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారని, జగన్ సీఎం అయ్యాక ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా జగన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ తనకు 30 నిమిషాల సమయం ఇస్తే కలిసి రాష్ట్ర అప్పు తీర్చి రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు.
తనను సీఎంగా గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. కుల, కుటుంబ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప, లాభం లేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని పాల్ అన్నారు. ఎన్నికలకు ముందు 25 ఎంపీ సీట్లు ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని జగన్ అన్నారని, ఇప్పుడేమో చంద్రబాబు, జగన్‌లు మోదీకి మసాజులు చేస్తున్నారని మండిపడ్డారు.