Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Sacrifices behind Independence: ఎందరో త్యాగధనులు.. అందరికి వందనాలు

Sacrifices behind Independence: ఎందరో త్యాగధనులు.. అందరికి వందనాలు

త్యాగదనుల చరిత్రను తలచుకోవటమే సరైన నివాళి

ఆగష్టు పదహయిదు ఓ పండుగ. ఆగష్టు నెల వస్తోందంటే అందరికీ సంబరమే. 15వ తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుం టారు. ఆ రోజు యావత్‌ దేశం అంతా కుల, మత, వర్గ విచక్షణ లేకుండా సమిష్టిగా అందరూ జరుపు కునే పండుగ. నిజంగా అన్ని చోట్ల పండుగ వాతా వరణమే ఉంటుంది. విద్యాసంస్థలలో పిల్లల నాటి కలు, ఏకపాత్రాభినయాలు ఊర్రుతలూగిస్తాయి. దేశ భక్తి నర, నరానా జీర్ణించుకుని పోయి పిల్లలు చేసే అభినయం చూసి చప్పట్లు చరిచే వారు కోకొల్లలు.
ఆ చప్పట్ల వెనుక వారి కృషి ఎనలేనిది. ము ఖ్యంగా పిల్లలు ఓ గాంధీ, ఓ అల్లూరి, ఓ నేతాజీ, ఓ సర్ధార్‌ పటేల్‌, ఓ భగత్‌ సింగ్‌ మొదలగు వారిని అనుకరిస్తూ చేసే అభినయం ప్రశంసనీయం. ప్రతి చోట ఇవే వేడుకలు, దేశాభక్తి పాటలు ఆ కొద్ది సేపే. ఇంకా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయా లలో మొక్కుబడిగా జెండా ఎగురవేయడం పరి పాటే. మరికొన్ని చోట్ల స్థలాలు లేక, కార్యక్రమం జరుపుకోవడానికి చాలినంత ‘జాగా’ లేక ఏదో జెండా ఎగురవేశామని చేతులు దులుపుకుంటు న్నారు.. గాలికి జెండా రెప రెపలాడుతూ ఉంటే దాని వెనుక ఎందరో మహనీయుల త్యాగం ఉంది. ఈ నాడు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చు కుంటు న్నామంటే అది వారు ప్రసాదించినదే. దాదాపు రెండు వందల సంవత్సరాల కాలం భారత్‌ ను ఏలి సంపద అంతా హరించి వేసి, మన భారతీయు లను నీచాతి నీచంగా చూసి తమ పబ్బం గడుపు కున్నారు తెల్ల దొరలు. ఆ తెల్ల దొరల దగ్గర పని చేస్తున్న కొందరు మన భారతీయులు వారికీ తం దనా పాడారు. అదే మన వాళ్ళకు నచ్చనిది. వారి డబ్బులకు అమ్ముడు పోయి ఆత్మాభిమానం చంపు కున్నారు. కొందరు ఇది చూసి సహించలేక ఎదు రు తిరిగారు. బ్రిటిష్‌ వారి గర్వం, అహంకారం పోవాలి అని మన వాళ్ళు నినందించారు. ఆ రోజు ల్లో భారతీయులు సమిష్టి కృషి చేసి తెల్ల దొరలపై పోరాడారు. బ్రిటిష్‌ వారి డౌర్జన్యం మితి మీరి పోవ డం, ఈ దిశలో సామాన్య ప్రజలు చైతన్యం కావ డం, వారిని ఎదురించడం జరిగింది. ప్రతి భారతీ యుడు మొక్కవోని ధైర్యంతో తెల్ల దొరలను ఎదు రించారు. భారతీయుల సమైక్యత చూసి బెంబేలె త్తిన బ్రిటిష్‌ వారు మనలో మనకే పొట్లాట పెట్టడం చేశారు. అయితే విజ్ఞత కలిగిన భారతీయులు బ్రిటి ష్‌ వారి ఎత్తుగడలను చిత్తు చేసి దైర్యంతో పోరా డారు. బ్రిటీష్‌ వారి కపటం చూసి సామాన్యులు సైతం పోరు సలిపారు. వారి కుయుక్తులు, వారి చేష్టలు భారతీయులను పలు ఇబ్బందుల పాలు చేశారు. మహిళలను సైతం లైంగికంగా వేదించి వారి మాన, ప్రాణాలు తీసిన ముష్కరులు ఉన్నారు. అటువంటి వారిని ఎదురించిన ఓ హం పన్న దైర్యం, తెగువ ఈ నాటికీ చెరిగిపోనిది. బ్రిటీ ష్‌ వారు మహిళలను వెంబడిస్తుంటే ఓ సామాన్య భారత పౌరుడు హంపన్న చూసి వారి మాన, ప్రాణాలు కాపాడి అమరుడయ్యాడు. ఇటువంటి ఘట్టాలు ఎన్నో, ఎన్నెన్నో భారత సంగ్రామంలో చోటు చేసుకున్నాయి. సిద్ధాంతాల పరంగా చూసు కుంటే అందరూ దేశ స్వాతంత్రం కొరకు పోరా డిన వారే, వారు అనుసరించిన మార్గాలే వేరు. అందులో మహాత్మా గాంధీ అనుసరించిన విధా నాలు సామాన్యులను ఆకర్శించాయి. గాంధీ ప్రజ ల హృదయాలలో చొచ్చుకు పోయాడు, ప్రజలలో మమేకం అయ్యాడు. చాలా వరకు దేశమంతా తిరి గాడు. ఆయన అడుగులో అడుగు వేసిన ఎందరో మహనీయులు ఉన్నారు. గాంధీ గారు వస్తున్నారు అంటే చిన్న పిల్లల సందడి అంతా ఇంతా కాదు. వాళ్లలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేది. ‘బోలో భారత మాతాకీ జై’ అని మూకుమ్మడిగా నినా దాలు చేసేవారు. వారి దేశ భక్తి, దేశం కోసం వారి ఆసక్తి చూసి ముచ్చట పడిపోయేవారు గాంధీ. గాంధీ గారి సిద్ధాంతాలలో ఎక్కువగా ప్రజలను ఆ కర్శించినది ‘క్విట్‌ ఇండియా’.
క్విట్‌ అంటూ సాగిన ఆ పోరు బ్రిటీష్‌ వారిని గడ గడ లాడించింది. మహాత్మా గాంధీ డు ఆర్‌ డై అనే పిలుపు నిచ్చాడు. ఆ పిలుపు ప్రజలలో బాగా నానింది. దేశం మొత్తం గాంధీ గారి వెంట నడి చింది. ఆ చైతన్యం, ఉవ్వేత్తున ఎగసిన కెరటాల వలే వస్తున్న ప్రజా వాహిని చూసి బ్రిటీష్‌ సైన్యం బిత్తరపోయింది. భారతీయుల అసమాన పోరా టం ముందు బ్రిటీష్‌ ప్రభుత్వం తల వంచింది. ఉద్యమ కారులు రెట్టించిన ఉత్సాహంతో పోరా డారు. ఆ ఉదృత పోరు చూసి బెంబేలెత్తిన బ్రిటీష్‌ వారు మన దేశం వీడక తప్పలేదు.. ఇలా ఎందరో, ఎన్నో పోరాటాలు. ఎందరో మహనీయులు స్వా తంత్ర సమరంలో అశువులు బాశారు. ఈ దినం (ఆగష్టు 15) వారందరిని తలుచుకుంటూ, వారి పోరాట పంధాను గుర్తుకు చేసుకుంటూ, ఆ త్యాగ మూర్తులకు వినమ్రతతో ముకుళిత హస్తలతో వం దనం సమర్పిస్తున్నాం. బ్రిటీష్‌ వారి పతాకం దిగి మువ్వన్నెల భారత పతాకం రెప రెప లాడుతుంటే ఆ జెండాను చూస్తూ దేశ స్వాతంత్రం కోసం పోరా టాలు చేసి మనకు స్వేచ్చ ప్రసాదించిన ఆ త్యాగ మూర్తులకు శాల్యూట్‌. జై హింద్‌.

  • కనుమ ఎల్లారెడ్డి,
    93915 23027.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News