Wednesday, October 30, 2024
HomeతెలంగాణKCR Raithu bandhu: రైతులకు శుభవార్త చెప్పిన కేసీఆర్

KCR Raithu bandhu: రైతులకు శుభవార్త చెప్పిన కేసీఆర్

తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్తను తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను సీఎం కేసిఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ.7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.

- Advertisement -

పంట పెట్టుబడి సాయం కింద..

రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నది. ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు తో పాటు, రైతు బీమా తో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడి ని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయం లో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా..దేశ వ్యవసాయ రంగ నమూనా మార్పు కు దారితీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు,ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయి. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను,కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News