Sunday, September 29, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: కేటీఆర్ కృషితోనే సిరిసిల్ల వస్త్రాలకు బ్రాండింగ్

Rajanna Sirisilla: కేటీఆర్ కృషితోనే సిరిసిల్ల వస్త్రాలకు బ్రాండింగ్

ప్రభుత్వ ఆర్డర్ లు లేకున్న నిలదొక్కుకోవాలి

గడిచిన 9 ఎండ్లలో బతుకమ్మ చీరల తయారీ, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కే తారక రామారావు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బలోపేతానికి, కార్మికులకు, ఆసాములకు అనేక విధాలుగా అండగా నిలిచారనీ రాష్ట్ర అండ్ డైరెక్టర్ అలుగు వర్షిని పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే రెండేండ్లలో ప్రభుత్వ ఆర్డర్ లు లేకున్నా ప్రైవేట్ ఆర్డర్ లతో నిలదొక్కుకునేలా, లాభదాయకంగా నడిపేలా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రత్యేక బ్రాండ్ ను సృష్టించుకుంటూ స్వతంత్రగా ఎదగాలన్నారు. రాష్ట్ర హ్యాండ్లూమ్‌, టెక్స్టైల్ డైరెక్టర్‌ అలుగు వర్షిణి సిరిసిల్లలో పర్యటించి బతుకమ్మ చీరల ఉత్పత్తిని నెహ్రూనగర్, వెంకట్రావు నగర్ లో పరిశీలించారు. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో నిమగ్నమైన కార్మికులతో మాట్లాడారు. రోజుకు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారు? విద్యుత్ వినియోగం ఎంత? ఆదాయం ఎంత వస్తుంది? అంటూ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

వస్త్ర పరిశ్రమ మరింత బలోపేతానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అవసరం ఉందా ? అంటూ ప్రశ్నించారు.సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్వరాష్ట్రం ఏర్పడ్డాక మంత్రి కేటిఆర్ ప్రత్యేక చొరవతో నూతన జవసత్వాలు అందిపుచ్చుకుందన్నారు. ప్రభుత్వ ఆర్డర్లతో కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా పనిదొరకడంతో ఆర్థికంగా ప్రయోజనం కలిగిందన్నారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ షాదీ ఖానాలో బతుకమ్మ చీరలు -2023 తయారీ ఉత్పత్తి ప్రగతి పై అలుగు వర్షిణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అనేక ఆర్డర్ లలో అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎదగాలన్న సకల్పం కార్మికులు, ఆసాములకు ఉండాలన్నారు. మూస ధోరణిలో కాకుండా, ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రొడక్ట్ డైవర్ ఫికేషన్, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2022 సంవత్సరంలో మిగిలిన బతుకమ్మ చీరలో .. క్వాలిటీ ఉన్న వస్త్రాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రాజుపాలెం లో బ్యాండేజి క్లాత్ ను ఉత్పత్తి చేస్తే టేస్కో ద్వారా కొనుగోలు చేస్తామన్నారు.వస్త్రోత్పత్తిలో మోడ్రనైజేషన్, కొత్తదనానికి పెద్దపీట వేస్తే మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే రెండు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లియర్ చేసేలా కృషి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, వైస్ ఛైర్మన్ మంచె శ్రీనివాస్ లు వస్త్ర పరిశ్రమలో సమస్యలు,పెండింగ్ బకాయిలు తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, వరంగల్ ఆర్ డిడి అశోక్ , జిల్లా హెచ్ & టీ ఏడి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News