Saturday, April 12, 2025
HomeతెలంగాణAbdullapurmet: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సన్మానించిన మధుసూదన్

Abdullapurmet: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సన్మానించిన మధుసూదన్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

భువనగిరి పార్లమెంట్ నాయకుల సమావేశానికి బయలుదేరి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి కి పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్వాగతం పలికిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకుడిగా విచ్చేసిన మానే శ్రీనివాస్ (కర్ణాటక ఎమ్మెల్యే)ని సన్మానించిన సిఎంఆర్.

- Advertisement -

అనంతరం కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గo ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అవినీతి..దోపిడీ, ఆక్రమ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ రెండు కుమ్మక్కై ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. బిజెపికి బీ టీంగా బిఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మండల మున్సిపాలిటీల అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News