Vasundhara Raje: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పొలిటికల్ కెరీర్ చిక్కుల్లో పడింది. ఈసారి పరిస్థితి చూస్తుంటే ఈమె ఖేల్ ఖతం అంటున్నారు పొలిటికల్ పండిట్స్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో రాజే పేరు లేకపోవటంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది. నిజానికి వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఎలాగైనా తననే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆమె పట్టుబడుతూ వస్తున్నా మోడీ, షాలు మాత్రం ఈమె వర్గాన్ని ఖాతరు చేయటం లేదు. దీంతో పొరుగున ఉన్న గుజరాత్ రాష్ట్ర ఎన్నికల్లో చక్రం తిప్పి తన ఇమేజ్ ను చాటుకోవాలని ఆమె తాపత్రయ పడ్డారు. తీరా చూస్తే ఈ లిస్ట్ లో వసుంధర రాజే పేరు లేకపోవటంతో హైకమాండ్ ఆమెపై ఓ ఫైనల్ స్టాండ్ తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. రాజస్థాన్ లో సెకెండ్ జనరేషన్ లీడర్షిప్ ను డెవలప్ చేయటంలో ఎప్పటినుంచో తలమునకలై ఉన్న మోడీ, షా ద్వయం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ రాజేకు క్లారిటీ ఇచ్చేశారన్నమాట.
ప్రస్తుతం రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయ సంప్రదాయం ప్రకారం ప్రతి 5 ఏళ్లకోమారు సర్కారు మారుతుంది, ఈ నేపథ్యంలో ఇక్కడ నెక్ట్స్ గవర్నమెంట్ బీజేపీదే అనే ధీమాతో ఉన్నారు కమలనాథులు. మరోవైపు గెహ్లాట్ వర్గంతో కలిసి వసుంధరా రాజే నెక్ట్స్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నుంచి ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. వెరసి బీజేపీ అధిష్ఠానం రాజేకు గట్టి షాకే ఇచ్చినట్టుంది.