Tuesday, May 20, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula: ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం మనదే

Gangula: ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం మనదే

ప్రచారం చేస్తున్న గంగుల

ప్రజల సంక్షేమం కోరే ప్రజల ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో గ్రామంలో సర్పంచ్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్ర రెడ్డి ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్ధి నల్లజన లక్ష్మీదేవి గంప గుర్తు పై ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సచివాల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరూ సచివాలయంలోనే పనిచేస్తున్నారని ప్రజలకు సంబంధించి ఏ పని కావాలన్నా మీగ్రామ సచివాలయంలో చేసుకుంటే వీలు ప్రభుత్వం కల్పించిందన్నారు.

- Advertisement -

గ్రామ ఓటర్లు ఆలోచించి గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని కోటకందుకూరు గ్రామం మరింత అభివృద్ధి చెందాలన్నా, మరింత సంక్షేమ పథకాలు అందాలన్నా మీ అమూల్యమైన ఓటును వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్ధి గుర్తు గంప గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల ఓటును అభ్యర్థించిన ఎమ్మెల్యే గంగుల ఆయన వెంట వైఎస్ఆర్సిపి నాయకులు రాజగోపాల్ రెడ్డి, రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, పెద్దయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News