Saturday, November 23, 2024
HomeతెలంగాణKaushik Reddy: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు దీటుగా వైద్యం

Kaushik Reddy: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు దీటుగా వైద్యం

అన్ని హంగులతో సుందరీకరణ చేసి 100 పడకల ఆసుపత్రి చేస్తా

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రైవేటుకు దీటుగా వైద్యం అదే విధంగా చేస్తా. ఆధునీకరణ చేసి 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలోనే అత్యంత అభివృద్ధి చెందిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని అంగులతో సుందరీకరించి వంద పడకల ఆసుపత్రిగా మార్చి, పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితుని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించేలాచర్యలు తీసుకున్నారు, శిథిలావస్థ లో ఉన్న మార్చు రీ భవనాన్ని తొలగించి దాని స్థానంలో అధునాతనమైన భవనాన్ని నిర్మించేలా చర్యలు చేపడతానని అన్నారు, గర్భిణీ స్త్రీ తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . రోగులకుపూర్తి స్థాయిలో వసతులు కల్పించి డాక్టర్లను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, కేడీసీసీ బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్, పింగిలి రమేష్ , స్థానిక కౌన్సిలర్లు,పార్టీ సీనియర్ నాయకులు పర్లపెల్లి రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News