Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి

Katasani: సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి

ఎన్నికలకు సిద్ధం కండి- గడప గడపకు మన ప్రభుత్వంలో MLA

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోన్న వైయస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని వైయస్ఆర్ సిపి జిల్లాల అధ్యక్షులు, మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. 19వ వార్డు 48వ సచివాలయ పరిధి సోమిశెట్టి నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -


ఈ సందర్భంగా బి.వై. రామయ్య మాట్లాడుతూ ’19వ వార్డు పరిధి చాలా ఎక్కువ, అందులో దాదాపు అన్ని నూతన కాలనీలే అయినా మౌలిక సదుపాయాలు వేగంగా కల్పిస్తున్నట్లు’ తెలిపారు. గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు గాలికి వదిలేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 19వ వార్డులో ఏకపక్షంగా వైయస్ఆర్ సిపికి ప్రజలు మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. అలాగే 19వ వార్డులో గ.గ.మ.ప్ర. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్పొరేటర్లకు, నాయకులకు, అధికారులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి
మరో 8 నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైయస్ఆర్ సిపి శ్రేణులకు ఇప్పటి నుంచే సిద్దం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధి, సంక్షేమమే తమ ఆయుధాలుగా మార్చుకోవాలన్నారు. అందరూ ప్రజల్లో ఉంటూ సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకోరావాలని పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే కోరారు. 19వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు రూ.2 కోట్లను ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేస్తామని తెలిపారు.

దిగ్విజయంగా గడప గడపకూ ప్రభుత్వం

మేయర్ బి.వై. రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డులో గడప గడపకూ మన ప్రభుత్వం దిగ్విజయంగా ముగిసింది. రెండు వారాల పాటు కార్యక్రమం కొనసాగింది. 5 సచివాలయ పరిధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళిన మేయర్, ఎమ్మెల్యేను ప్రజలు ఘనస్వాగతం పలికారు. వారితో కాసేపు అప్యాయంగా మాట్లాడారు. కాగ గతంలో 19వ వార్డు అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల్లో తిరగాలని అనేక విమర్శలు చేసినప్పటికీ, పత్రికల కథనాలు వచ్చినప్పటికీ గడప గడపకూ మన కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనతో అవన్నీ అసత్యాలే అని తేటతెల్లమైంది. దీంతో వార్డు నాయకుల్లో నూతనోత్సాహం నెలకొంది.


కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్ రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, నారయణ రెడ్డి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ట్యాప్ ఇంస్పెక్టర్ రఫిక్, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, నాయకులు కనికే శివరాం, అక్కిమి హనుమంత్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, బాలచంద్ర రెడ్డి, అనిల్ కుమార్, సామన్న, సంతోష్, చిన్న, శ్రీను, తిరుపాలు, మధు, సుభాషిణి, నిర్మల, కిరణ్, మున్సిపల్ సిబ్బంది నర్సింహులు, మద్దయ్య, ఇబ్రహీం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News