Friday, September 20, 2024
HomeతెలంగాణVanaparthi: విద్యా రాజధానిగా వనపర్తి

Vanaparthi: విద్యా రాజధానిగా వనపర్తి

తెలంగాణ తెచ్చుకున్నది యువత, విద్యార్థుల కోసమే

భవిష్యత్ లో  విద్యా రాజధానిగా వనపర్తి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి లక్ష్మీ గార్డెన్ లో భారీఎత్తున నిర్వహించిన విద్యార్థి ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ తర్వాత అన్ని విద్యాలయాల ఏర్పాటుకు చేస్తున్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్, మత్స్య, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

- Advertisement -

తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న మెడికల్ కళాశాలలు కేవలం అయిదు .. అందులో మూడు హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి .. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి కేవలం రెండు మాత్రమే అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా ఆరు లక్షల పైచిలుకు ఐటీ ఉద్యోగాలు ప్రత్యక్ష్యంగా వచ్చాయని అన్నారు.

తెలంగాణలోని పారదర్శక  పారిశ్రామిక విధానం మూలంగానే ఇది సాధ్యం అయిందని, భవిష్యత్ లో ఎవరూ ఊహించని కళాశాలలను వనపర్తిలో ఏర్పాటు చేయిస్తాం అని అన్నారు.పేద విద్యార్థులకు అవసరమైన ప్రతి కోర్సు వనపర్తిలో ఏర్పాటు చేయించాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాననీ, అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయిన వారు అత్యధికులు  హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నవారే .. ఒకప్పుడు చదువుకోవడానికి ఎలాంటి వసతులు ఉండేవి కావు .. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విద్యార్థులు, యువత ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థానాలలో  నిలబడాలని సూచించారు.ఎంచుకునే లక్ష్యం గొప్పగా ఉండాలి .. దానికి అనుగుణంగా పట్టుదలగా పనిచేస్తూ ముందుకు పోవాలని,సాధించాల్సిన దానికి పేదరికం అడ్డుకాదు .. దానికి అంబేద్కర్ మహాశయుడే నిదర్శనం .. పట్టుదల ఉంటే కానిది లేదన్నారు.తెలంగాణ తెచ్చుకున్నది యువత, విద్యార్థుల కోసమే, ఒకప్పుడు ప్రతి నెలా సర్కారు ఇచ్చే కంట్రోలు బియ్యం కోసం ఎదురుచూసిన దుస్థితి ఉండేదన్నారు. ఇక్కడ ఉన్న భూములకు నీళ్లివ్వకుండా ఎండబెట్టి ఎక్కడో పండిన బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేది, వాటినే మహాప్రసాదం అనుకుని కంట్రోలు బియ్యం తిని బతికాం అని, ఇప్పుడు తెలంగాణ వచ్చిన పదేళ్లకు ఇలా పేజీ తిరగేస్తే గత యాసంగి సీజన్ లో దేశమంతా 94 లక్షల ఎకరాలలో వరి సాగయింది. ఒక్క తెలంగాణ  రాష్ట్రంలో 56.40 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు .. ప్రస్తుతం తెలంగాణలో ఏటా 2.70 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు.


ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి ఇఛ్చి, ఉచిత కరంటు ఇచ్చి, సాగునీళ్లు ఇచ్చి, పండిన పంట కొనడం, రైతుల శ్రమమూలంగా తెలంగాణ ఈ స్థాయికి చేరుకున్నదని, పంటలు పండడం మూలంగా ఒక రైతు మాత్రమే బాగుపడడు .. రైతుకూలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి బతికే అన్నిరంగాల వారు బాగుపడతారనీ అన్నారు. పొట్టచేతబట్టుకుని బతుకుదెరువు కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేదు..  ఎవరికి చేతనయినంత పని వారు చేసుకుని హాయిగా జీవనం  వెళ్లదీయవచ్చని, వ్యవసాయరంగం బలోపేతం చేయడం మూలంగా ఆ రంగంలో ఉపయోగించే ఎరువులు, యంత్రాలు, ఇంధన పరిశ్రమలు,  అక్కడ పండే పంటలు, ఆ పంటల కోసం ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వంటి వాటి ద్వారా లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.

తెలంగాణలో కూలీలు దొరక్క దేశంలోని 14 రాష్ట్రాల నుండి కూలీలు వచ్చి వ్యవసాయ, పారిశ్రామిక ఇతర రంగాలలో పనిచేస్తున్నారనీ,తెలంగాణ ఇప్పుడు తెలంగాణ వాసులకే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఉపాధినిచ్చే ప్రాంతంగా ఎదిగిందన్నారు.విద్యార్థి సమ్మేళనంలో భాగంగా విద్యార్థులకు పలు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి నగదు బహుమతులు అందజేసిన మంత్రి.
హాజరైన  రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ కవి కోయి కోటేశ్వర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త వంగూరి ప్రమోద్ రెడ్డి, సీనియర్ సమన్వయకర్త రాములు యాదవ్,  బీఆర్ఎస్ విద్యార్థి నేత మారెడ్డి నరేష్ రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భాగ్యరాజ్, జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్, విద్యార్థి నేతలు శ్రవణ్ కుమార్, గిరి, గంగప్రసాద్, గంధం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News