Friday, September 20, 2024
HomeతెలంగాణGangula: నేతన్నలకు వెలుగులు, సంతోషం

Gangula: నేతన్నలకు వెలుగులు, సంతోషం

నేతన్నల కళ్ళలో వెలుగులు నింపి వారి జీవితాల్లో సంతోషాలను పంచేలా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రంలోని వి కన్వేన్షన్ హాల్ లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత వారోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సృష్టి అవతరించినప్పడి నుండి ఉన్న నేతన్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించే నాటికి నేతకార్మికుల జీవితాలు నిరాదారణకు గురై ఆత్మహత్యలు, వృత్తిని వలసలకు వెల్లే దుస్థితి తెలంగాణలో నెలకొని ఉండేదని తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం నేతన్నల కళ్ళలో వెలుగులు నింపి వారి కుటుంబాలలో సంతోషాలు నిండాలని, ఎక్కడా ఏ నేత కార్మికుడు ఆత్మహత్యలకు పాల్పడకూడదనే దృఢనిశ్చయంతో, తెలంగాణ రాష్ట్రంలో సంపద పెరగాలే, పెరిగిన సంపద పేదలకు అందాలే అని, రాబోయె రోజుల్లో కులవృత్తలపై ఆదారపడ్డ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన విధానంతో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. 70 సంవత్సరాల ఉన్న నేతన్నలు కంప్యూటర్ తో వేగంతో సమానంగా మగ్గాలపై చీరనేసే విధానం అద్భుత ఘాట్టమని, భవిష్యత్ లో ఇంతటి అద్బత ప్రక్రియ ఎవరికి సాద్యపడదని తెలిపారు. 8శాతం మనం కడితే, 16 శాతం నేరుగా ప్రభుత్వం చేల్లించే త్రిఫ్ట్ ఫండ్ పథకం (నేతన్నకు చేయుత) గురించి గ్రామగ్రామాన ఉన్న నేత కార్మికులు తెలుసుకోవాలని, ఈ పథకాన్ని సెప్టెంబర్ 1 నుండి అమలు చేయనున్నామన్నారు.

- Advertisement -

చేనేత కార్మికులు వస్త్రాల కొరకు వాడే రసాయనాలను తమిళనాడు నుండి తీసుకురావడంతో కేసుల పాలయ్యే స్థితి నెలకొందన్నారు. చేనేతమిత్ర పథకం తీసుకువచ్చి నేరుగా బ్యాంకు ఖాతాలో 3వేల రూపాయలను జమచేస్తామని తెలిపారు. రైతుబందు పథకం మాదిరిగా నేతన్నల జీవితాల్లో బరోసా కలిగించే విదంగా నేతన్నబందు పథకాన్ని తీసుకువచ్చి 5లక్షల భీమా వర్తింపజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 36 వేల మంది నేత కార్మికులను ఈపథకంలో చేర్చామన్నారు. పావలవడ్డి ద్వారా 12 శాతానికి 3శాతం లబ్దిదారులు భరిస్తే మిగిలిన 9శాతం ప్రభుత్వమే కడుతుందన్నారు. నేత కార్మికుల ద్వారా దసర, దీపావళి పండుగలకు పేదలకు పంచే చీరలతో ఉపాది పెరిగిందన్నారు. చేనేత, బడుగు బలహీన వర్గాలకు చేయుత నందించేలా గొప్ప గొప్ప పథకాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు , ఆల్ ఇండియా పవర్ లూమ్ బోర్డులను రద్దు పరిచడంతో కోల్ కత్త, కోయంబత్తూర్, భీవండి మరియు మొంబై లోని చేనేత పరిశ్రమలు మూతపడే పరీస్థితులు నెలకోన్నాయని దీనితో చేనేత కార్మికులు తీవ్రఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిఒక్కరికి ఉపాధి కలగాలి, తద్వారా వలసలు బంద్ కావాలే అని సంక్షేమ పథకాలు, కుల వృత్తుల ద్వారా చేయూతనందించడం జరిగిందన్నారు. తెలంగాణలొని కోకాపేటలో పద్మశాలి కుల సంఘం కొరకు 2 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. రెక్కాడితే గాని డోక్కాడని కులవృత్తులను ఆదుకోవాలే, వెనుకబడిన కులాలకు చెందిన కుటంబంల్లోని ఆడపిల్ల పెళ్లికి అప్పులు తెచ్చి ఆ అప్పులకు మిత్తీలు కట్టలేని స్థితి నెలకొకుండా, రాష్ట్ర ముఖ్యమంతి కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి,1,00,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. అంతేగాక ఆ బిడ్డ ఓ బిడ్డకు జన్మనిస్తే కేసిఆర్ కిట్ ఇస్తున్నామన్నారు. ఆ బిడ్డ చదువుకోడానికి మహత్మజ్యోతి భా పూలే పాఠశాలలను అందించామన్నారు.

కార్యక్రమంలో నేతన్నకు చేయుత పథకం ద్వారా 6,82,58,952 చెక్కును, చేనేత మిత్ర పథకం ద్వారా 5,30,19,650 చెక్కును, పావలావడ్డి పథకం ద్వారా 2,98,39,600 చెక్కును, క్యాష్ క్రెడిట్ ద్వారా 3,63,00,000 చెక్కులను అందజేశారు. అనంతరం కొండాలక్ష్మణ్ బాపూజి అవార్డు గ్రహితను సత్కరించి , ముగ్గురు నేతన్నలను ఐడి కార్డులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమం లో చేనేత జౌళిశాఖ డైరెక్టర్ అలుగు వర్షిని,నగర మేయర్ వై. సునీల్ రావు, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. బి. గోపి , అడిషనల్ డైరెక్టర్ పి. వెంకటేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, చేనేత జౌలి శాఖ ఆర్డిడి అశోక్ రావు,ఏడి సంపత్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పద్మశాలి సంఘం నాయకులు మెతుకు సత్యం, వాసాల రమేష్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రామచంద్రం అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News