Sunday, September 29, 2024
HomeతెలంగాణNiranjan Reddy: మంత్రికి అమెరికా 'ఫార్మ్ ప్రోగ్రెస్ షో' ఆహ్వానం

Niranjan Reddy: మంత్రికి అమెరికా ‘ఫార్మ్ ప్రోగ్రెస్ షో’ ఆహ్వానం

3 రోజులపాటు సాగే ప్రదర్శనకు మంత్రి రెడీ

అమెరికాలో ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో (వ్యవసాయ ప్రగతి ప్రదర్శన)కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 29 నుండి 31 వరకు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ లో ప్రదర్శన జరుగనుంది. ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు, సాంకేతికతలు, వ్యవసాయ రసాయనాలు, పరికరాలు, విత్తన సాంకేతికతలపై ప్రదర్శన జరిగే వేదికగా ఇది ప్రఖ్యాతి గాంచింది.

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యం ఇస్తుందనిస పదేళ్లకాలంలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని, వ్యవసాయ రంగంలో కూలీల కొరత, నకిలీ విత్తనాలు, పెరుగుతున్న పెట్టుబడులు ప్రధాన సమస్యగా ఉన్నాయన్నారు మంత్రి. వాటిని అధిగమించేందుకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, పెట్టుబడులను తగ్గించడం, రైతు పండించిన ఉత్పత్తులకు అధిక ధరలను కలిపించడం మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. అత్యధిక శాతం జనాభాకు ఉపాధినిచ్చే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అంటూ మంత్రి వివరించారు. అమెరికాలో జరగనున్న ఈ వ్యవసాయ ప్రదర్శన దానికి తోడ్పడుతుందని భావిస్తున్నట్టు, అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వ్యవసాయ ప్రదర్శనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో హాజరయ్యేందుకు సిద్దమయ్యారు మంత్రి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News