బండిఆత్మకూరు మండలంలోని పెద్దదేవలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ఆవరణంలో విచ్చలవిడిగా మందును ప్రతిరోజు ప్రక్క గ్రామాల నుండి అధికారపార్టీ పెద్దల అండతో ఒకరిద్దరు వ్యక్తులు వచ్చి ఉదయం 7గం నుండి 9 గం వరకు లిక్కర్ క్వాటర్ సీసాలు విక్రయిస్తున్నారు. ఒక్క క్వాటర్ సీసా పైన 50 రూపాయలు అదనంగా వసూల్ చేసుకుని తమ జేబులు నింపుకొని పోతున్నారు. గ్రామంలో మందుబాబులు ఇంట్లో భార్య బిడ్డలను పీడించి వారి పనిచేసిన కూలీ డబ్బులను తెచ్చుకొని వారిదగ్గర కొని అక్కడే తాగుచున్నారు రాత్రి 7 గం నుండి 10 గం వరకు సచివాలయం ఆవరణంలో విచ్ఛలవిడిగా గుంపులు గుంపులుగా కూర్చోని మందు సేవించి సీసాలు అక్కడ వదలివేయడంతో అవి పగిలి ఎక్కడ చూసినా గాజుపెంకులు గుట్టలు గుట్టలు గా ఉండటం చూసేవారు ఇది సచివాలయమా లేక సారా అంగడినా అని వాపొతున్నారు. జగనన్న కాలని నిర్మాణం కూలీలు చెప్పులు లేకుండా నడవలేని స్థితి ఏర్పడింది. దీనిని అరికట్టకుండా పోలీసు అధికారులు, సచివాలయ అధికారులు, గ్రామ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూవుండటం శోచనీయం.
Bandiathmakuru: సచివాలయమా లేక సారా అంగడినా?
అధికారులు, ఊరి పెద్దలకు ఇవేవీ కనిపించవా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES