Saturday, April 19, 2025
HomeతెలంగాణSuryapeta: పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన KCR

Suryapeta: పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన KCR

జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కి బాధ్యతలు అందించిన సీఎం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ వద్ద పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ కు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కార్యాలయం ప్రారంభించి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ ను సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించి బాధ్యతలను అందించారు. అనంతరం కార్యాలయం చుట్టూ తిరిగి పరిశీలించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, డిజిపి రాజీవ్ రతన్, ఇంటలిజెన్స్ అడిషనల్ డిజిపి అనిల్ కుమార్, ఐ జి చంద్రశేఖర్, ఐ ఎస్ డబ్ల్యూ ఐ జి ఇక్బాల్, డి ఐ జి చౌహన్, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News