Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభBiggBoss 6 : విన్నర్ రన్నరయ్యాడు.. రన్నర్ విన్నరయ్యాడు.. ఇంతకీ ఎవరికెంతొచ్చింది ?

BiggBoss 6 : విన్నర్ రన్నరయ్యాడు.. రన్నర్ విన్నరయ్యాడు.. ఇంతకీ ఎవరికెంతొచ్చింది ?

బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. హమ్మయ్యా.. ఈ సీజన్ పూర్తయింది అనుకుంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే గత సీజన్లలో ఎన్నడూ లేనంతగా.. ఈ సీజన్ అంత బోరుగా సాగింది మరి. అనవసరమైన ట్విస్టులు, అన్ ఫెయిర్ ఎలిమినేషన్స్ చిరాకు తెప్పించాయి. ఆఖరికి వీకెండ్ ఎపిసోడ్ లకు కూడా టీఆర్పీ రాలేదు. ఈ సీజన్ లో యాజమాన్యం చేసిన తంతులకు ఆఖరికి నాగార్జునే విసుగెత్తిపోయారని టాక్. అందుకే నెక్ట్స్ సీజన్ నుండి ఆయన హెస్ట్ నుండి తప్పుకుంటున్నారని తెలిసింది.

- Advertisement -

ఇక గ్రాండ్ ఫినాలే విషయానికొస్తే.. ఊహించినంత ఎంటర్టైన్ మెంట్ కూడా లేదు. ప్రతి సీజన్లో గెస్టులు వచ్చి అలరించేవారు. కానీ ఈ సారి నిఖిల్, రవితేజ, శ్రీలీల మాత్రమే గెస్టులుగా వచ్చారు. ఇక సీనియర్ నటి రాధ బీబీ జోడి తరపున వచ్చారు. విన్నర్ ఎవరో ముందే లీకైంది కానీ.. చివర్లో నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ లో 5 గురు ఉండగా.. ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఆఖర్లో రేవంత్, శ్రీహాన్ ఉండగా.. నాగార్జున హౌస్ లోకి వెళ్లి.. విన్నింగ్ అమౌంట్ నుండి బంపరాఫర్ ఇచ్చారు. 20 లక్షలతో మొదలైన ఆఫర్ ను.. 40 లక్షల వరకూ పెంచడంతో.. శ్రీహాన్ తన తల్లిదండ్రుల సూచన మేరకు ఆ ఆఫర్ ను స్వీకరించాడు.

ఇద్దరినీ బయటికి తీసుకొచ్చాక.. నాగార్జున రేవంత్ ని విన్నర్ గా అనౌన్స్ చేశారు. ట్రోఫీ అందజేసిన అనంతరం.. ఓటింగ్ ప్రకారం టాప్ 1లో శ్రీహాన్ ఉన్నాడని, కానీ అతను 40లక్షలు తీసుకోవడంతో రేవంత్ విన్నరైనట్లు తెలిపారు. శ్రీహాన్ ఆ ఆఫర్ ను తీసుకోకపోయుంటే.. విజేతగా 50 లక్షల నగదు, మారుతి బ్రెజా కారుతో పాటు 605 గజాల స్థలం బహుమతులుగా పొందేవాడు. విన్నరైన రేవంత్ కు రూ.10 లక్షలు నగదు, బిగ్ బాస్ 6 ట్రోఫీ, మారుతి బ్రెజా కారు, సువర్ణభూమి నుండి 605 గజాల స్థలాన్ని బహుమతులుగా అందుకున్నాడు. శ్రీహాన్ కు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే వీటి విలువే ఎక్కువని సమాచారం. శ్రీహాన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటే.. రేవంత్ ట్రోఫీని గెలుచుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News