Sunday, October 6, 2024
HomeతెలంగాణRasamai Balakishan: ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా విజయం

Rasamai Balakishan: ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా విజయం

మానకొండూరులో మిన్నంటిన సంబురాలు

కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ స్థానానికి మూడవసారి బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రసమయి బాల కిషన్ కు టిక్కెట్ ప్రకటించడంతో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాలలో ఆనందోత్సాలతో బానాసంచా పేలుస్తూ, స్వీట్లు పంపిణి చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… మానకొండూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపించి, నా..పాటకు పట్టం కట్టి ఆశీర్వదించిన మీకు ఏమిచ్చి మీ..ఋణం తీర్చుకోను, నన్ను ఆదరించి, అక్కున చేర్చుకొని ఆశీర్వదించిన మానకొండూర్ నియోజక వర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మరోసారి నియోజకవర్గ ప్రజలకు సేవే చేసే అదృ ష్టాన్ని కలిగించిన సీయం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపా ధ్యక్షుడు బీ.వినోద్ కుమార్, మంత్రి గంగుల కమ లాకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • రసమయి సమక్షంలో బారీ చేరికలు
  • రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ సమక్షంలో
    క్యాంపు కార్యాలయంలో శంకరపట్నం మండలంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు బారీగా చేరారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, ముత్తారం, ధర్మారం గ్రామాలలోని యువకులు గులాబీ గూటికి చేరగా, రసమయి, బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి. రామకృష్ణా రావులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీ.ఆర్.ఎస్ పార్టీలోకి యువత చేరడం అభినంద నీయం అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో బీ.ఆర్.ఎస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. దేశ రాజకీయాలు క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ అడుగులో అడుగులు వేసే విధంగా ఇతర పార్టీ కార్యకర్తలు బీ.ఆర్.ఎస్. వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రతి కార్యకర్త సరైన రీతిలో బుద్ది చెప్పాలని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రసమయి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీ.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచులు, ఎంపిటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • పార్టీ శ్రేణుల సంబరాలు…
  • రాష్ట్ర సంస్కృతక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కు అవకాశం కల్పించిన శుభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ జనాలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపు కున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని రసమయికి మద్దతుగా జై జై నినాదాలు చేస్తూ, టపాసులు పేల్చు తూ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ మాట్లాడుతూ.. మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రసమయి బాలకిషన్ కు మూడోసారి అవకాశం ఇచ్చిన శుభ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న 100 రోజుల్లో ప్రతి కార్యకర్త రసమయి గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ మానకొండూరు గడ్డపై మూడోసారి బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తూ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలి పించడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వచ్చే కొత్త ప్రభుత్వంలో ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ను మంత్రిగా చూడాలని ప్రతి కార్యకర్త కోరుకుం టున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ల్యాగల వీరారెడ్డి, సల్ల రవీందర్, పాశం అశోక్ రెడ్డి,
    కవ్వంపల్లి పద్మ, మెంగని రమేష్, వంతడుపుల సంపత్, పారునంది జలపతి, పింగీలి నరేందర్ రెడ్డి, గంగిపెల్లి సంపత్, నార్ల అశోక్, పెట్టం రమేష్, పొన్నం అనిల్, ఖమ్మం కృష్ణ, ఎల్క ఆంజనేయులు, ల్యాగల దేవేందర్ రెడ్డి, తుర్పటి అజయ్, రోడ్డ రమేష్, తాళ్లపల్లి నందకిషోర్, ఎండీ రఫీ, అల్వాల సంపత్, ఉప్పులేటి కుమార్, ఆంజనేయులు, కిన్నెర అంజి, అలువాల సంపత్, కొమ్ము సంపత్, గాజా సాగర్, గొస్కి శ్రీనివాస్, అసోధ శ్రీనివాస్, అసంపెల్లి అశోక్, సముద్రాల మల్లేష్, ఎల్కపెల్లి పర్షారములు, లక్ష్మణ్, మేకల సునీల్, ఎనగందుల సతీష్, భామండ్ల మల్లేష్, ప్యాడ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News