Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభWaltair Veerayya : 'నువ్వు శ్రీదేవి అయితే నేనే చిరంజీవి అవుతా'

Waltair Veerayya : ‘నువ్వు శ్రీదేవి అయితే నేనే చిరంజీవి అవుతా’

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీర‌య్య‌’. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న‌ ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, బాస్ పార్టీ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట‌ను విడుద‌ల చేశారు. “నువ్వు సీత‌వైతే నేను రాముడినంటా, నువ్వు రాధ‌వైతే నేను కృష్ణుడినంటా.” అంటూ ఈ పాట సాగుతోంది. ఇక ఆఖ‌ర్లో “నువ్వు శ్రీదేవి అయితే నేనే చిరంజీవి” అంటా అనే క్యాచీ లిరిక్స్‌తో ముగించారు. ఈ మెలోడియ‌స్ పాట‌ని జాస్ ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ అద్భుతంగా పాడారు. ఈ పాట‌కి సంగీతంతో పాటు లిరిక్స్ దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించాడు. కొద్ది సేప‌టి క్రిత‌మే విడుద‌లైన ఈ పాట యూట్యూట్‌లో దూసుకుపోతుంది. శేఖ‌ర్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన స్టెప్పుల‌కు మెగాస్టార్ గ్రేస్ తోడు అవ్వ‌డంతో అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News