Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collectorate: రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్ ల పూర్తి చేయాలి

Kurnool Collectorate: రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్ ల పూర్తి చేయాలి

ఆగస్టు 31 నాటికి నిర్మాణాలు పూర్తి కావాల్సిందే

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి ఆగస్టు 31 నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు పూర్తి చేసి సంబంధిత అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా జి.సృజన టెలికాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఇంజనీర్లు, తదితరులతో హౌసింగ్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి ఓర్వకల్లు, పత్తికొండ మండలాల్లో పురోగతి తక్కువగా ఉందని, అవసరమైతే లేబర్ ని మరింత పెంచి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత ఏ.ఈ లను ఆదేశించారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి రూఫ్ లెవెల్ నుండి రూఫ్ వేసే వరకు నిర్దేశించిన లక్ష్యాలను కోడుమూరు, ఆదోని, దేవనకొండ, చిప్పగిరి మండలాలు సాధించలేకపోతున్నాయని ప్రోగ్రెస్ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి బేస్మెంట్ లెవెల్ నుండి కంప్లీషన్ స్థాయి వరకు స్టేజ్ కన్వర్షన్లో జీరో పురోగతి నమోదు చేసిన వెల్దుర్తి, నందవరం, చిప్పగిరి, ఆదోని రూరల్, ఆదోని అర్బన్, కర్నూలు, కృష్ణగిరి మండలాలకు చెందిన హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ల నిర్లక్ష్యధోరణిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా జీరోలు నమోదు చేయడం ఏంటని, పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జగనన్నకి చెబుదాం కి సంబంధించి పరిష్కరించిన గ్రీవెన్స్ లకు సంబంధించిన ఈ కేవైసీ సోమవారం నాటికి పూర్తి చేయాలని చెప్పినప్పటికీ కర్నూల్ అర్బన్, కౌతాళం,ఆదోని అర్బన్, ఆదోని రూరల్, ఎమ్మిగనూరు అర్బన్, ఎమ్మిగనూరు రూరల్ లో ఇంకా పెండింగ్ ఉన్నాయని, ఈ రోజు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ..ఈ అంశంపై రెండు గంటలకు ఒకసారి నివేదికలను గ్రూపులో పోస్ట్ చేసే.విధంగా పర్యవేక్షించాలని జిల్లా పరిషత్ సీఈఓ, సిపిఓ అప్పలకొండ ని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా జగనన్న సురక్షలో భాగంగా పథకాలకు సంబంధించి వచ్చిన అర్జీలను వెరిఫై చేయడంలో నందవరం, మంత్రాలయం, కోసిగి, కౌతాళం నాలుగు మండలాలు వెనుకబడి ఉన్నాయని, ప్రోగ్రెస్ చూపించాలన్నారు. పురోగతి కనపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కన్సిస్టెంట్ రిథమ్స్ తనిఖీలో భాగంగా పాఠశాలలను, వసతి గృహాలను, అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేయడంలో వెనుకబడి ఉన్న మండలాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత మండల అధికారులను ఆదేశించారు.
టెలికాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ వెంకట నారాయణ, పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News