Saturday, October 5, 2024
HomeతెలంగాణNiranjan Reddy: కేసీఆర్ ముందుచూపుతో 33 జిల్లాలు

Niranjan Reddy: కేసీఆర్ ముందుచూపుతో 33 జిల్లాలు

ప్రజల సౌలభ్యం కొరకు జిల్లా స్థాయి కార్యాలయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన దక్షత, ముందు చూపుతో 33 జిల్లాలో ఏర్పడి ప్రతి జిల్లాకు 50 నుండి 55 జిల్లాస్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ అన్నారు. వనపర్తి జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు (S.E) నూతన కార్యాలయ భవనానికి రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, అన్ని జిల్లాల్లో ప్రజల సౌలభ్యం కొరకు జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లాలో సైతం 50 నుండి 55 వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయని మంత్రి వివరించారు. వనపర్తి జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు సంబంధించిన ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ నూతన కార్యాలయం వనపర్తి జిల్లాలో ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.

- Advertisement -

ఒకప్పుడు ప్రజలు మారుమూల గ్రామాల నుండి తమ అవసరాల కొరకు జిల్లా కేంద్రాలకు వెళితే ఎంతో అసౌకర్యం, ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు అధికారులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడేది అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందుచూపు, పరిపాలన దక్షతతో నేడు అన్ని జిల్లాలకు జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయని దాని మూలంగా సత్వర పనులు జరగడమే కాకుండా అనేక రకాల ఉపాధి, పర్యవేక్షణ పెరిగి సత్వర పనులు పూర్తి కావడం జరుగుతుందని తెలియజేశారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎస్. ఈ ఆర్ అండ్ బి యం. నర్సింగమ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కార్య నిర్వాహక ఇంజనీరు దేశ్యా నాయక్, డిప్యూటీ ఈ. ఈ దానయ్య ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News