తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకం లబ్దిదారులున్నారని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. వికలాంగులకు ఆసరా ఫించను రూ 3016 /-నుండి రూ 4016/- పెంచిన ప్రొసీడింగ్ కాపీలను అందజేసే కార్యక్రమాన్ని రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అన్నారు. వికలాంగులకు ఇస్తున్న నామమాత్ర రూ 500 /- ఫించనును రెండు సార్లు పెంచి రూ. 4016/- చేసిన ఘనత కెసిఆర్ దేనని అన్నారు. రామగుండం నియోజక వర్గం లో 28, 225 మంది ఆసరా ఫించను పొందుతున్నారని అన్నారు. మంచిర్యాల సభలో ముఖ్యమంత్రి కె సి ఆర్ హామీ ఇచ్చిన ప్రకారం 3874మంది వికలాంగుల లబ్దిదారులకు వెయ్యి రూపాయలు పెరిగిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాల ప్రవేశ పెట్టి నిరుపేద ప్రజలకు అండగా నిలిచిన కనిపించే దేవుడు కె సి ఆర్ అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవడం మనందరి బాధ్యతని అన్నారు.
పలువురు లబ్దిదారులు వేదిక పైకి వచ్చి మాట్లాడుతూ ఫించను మొత్తం రూ 3016 /-నుండి రూ 4016/- కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు, అంతకు ముందు ఆసరా వికలాంగుల ఫించను లబ్దిదారులతో కలిసి ఎంఎల్ఎ సహపంక్తి భోజనం చేశారు. ఎంఎల్ఎ ఆదేశాల మేరకు వికలాంగులకు అసౌకర్యం కలగకుండా లబ్దిదార్లకు ప్రొసీడింగ్ కాపీలను వారి వద్దకే వచ్చి సిబ్బంది అందజేశారు. ఎయిట్ ఇంక్లైన్ కాలనీ వంటి సుదూర ప్రాంతాల నుండి రాలేని వారికి అక్కడే ఈ పత్రాలు అందజేయాలని ఎంఎల్ఎ ఆదేశించారు.
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ డా. బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు జె. అరుణ శ్రీ, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు , కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్ , కల్వచర్ల కృష్ణ వేణి , జనగామ కవితా సరోజినీ , నీల పద్మ , మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ , ఎగ్లాస్ పూర్, మద్ది ర్యాల , సోమన్ పల్లి , అంతర్గాo తదితర గ్రామాల సర్పంచ్ లు దేవక్క, సతీష్ , నూక రాజు , శ్రీనివాస్ , రామగుండం నగర పాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ త్రయoబకేశ్వర్ రావు , సూపరింటెండెంట్ మనోహర్ , అంతర్గాo , పాలకుర్తి ఎం పి డి ఓ లు , డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేగా మరో అవకాశమివ్వండి
ఒక సాధారణ కార్యకర్తకు, ఉద్యమ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ, జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టిన పార్టీ బిఆర్ఎస్ అన్నారు. మూడు వందల కోట్ల పైచిలుకు నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ది పరచానన్నారు. ప్రజల అవసరాలను తీర్చే శాశ్వత నిర్మాణాలు, ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసానన్నారు. అందులో భాగంగానే మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపట్టానన్నారు. గత ఐదు సంవత్సరాలలో చాలా అభివృద్ధిని సాధించామని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, కరోనా లాక్ డౌన్ కారణంగా అభివృద్ధి పనులు పూర్తి కాలేదన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకై మళ్ళీ ఎమ్మేల్యేగా అవకాశం కల్పించాలని కోరారు.