Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Debt : ఏపీ అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్రం..ఆ భారమంతా ప్రజల నెత్తినే

AP Debt : ఏపీ అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్రం..ఆ భారమంతా ప్రజల నెత్తినే

నేడు (సోమవారం,డిసెంబర్ 19) కేంద్రం లోక్ సభలో ఏపీ అప్పుల వివరాలను వెల్లడించింది. పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను తెలిపింది. ఏపీ అప్పుల భారం ఏటా పెరుగుతోందని పేర్కొంది. కేంద్రం బడ్జెట్ లెక్కల ప్రకారం.. 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక శాఖ వివరించింది. వెరసి 2018 కంటే 2021కి అప్పులు 17.1 శాతం పెరిగినట్లు తెలిపింది.

- Advertisement -

2017-18 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతం అప్పులు తగ్గాయి కానీ..2020-21 ఆర్థిక సంవత్సరంలో అప్పులు గతం కంటే 17.1 శాతం పెరిగాయి. రాష్ట్ర జీడీపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతం ఉంటే.. 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని వివరించింది. అలాగే 2015లో 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులుంటే.. 2021కి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ వివరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా తెలిపారు.

నిజానికి రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. ఆ భారమంతా పన్నుల రూపంలో, కరెంట్ ఛార్జీల పెంపు రూపంలో, ఇతరత్రా కొనుగోళ్ల రూపంలో ప్రజలపైనే పడుతుంది. సంక్షేమ పదకాలు ఇస్తున్నారు కదా అని సంబరపడిపోతే.. అంతకు నాలుగింతలు పన్నుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News