Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభMrunal Thakur : హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఇండస్ట్రీ వాళ్ళే నిర్ణయిస్తారు.. మేం అడగడం నేర్చుకోవాలి..

Mrunal Thakur : హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఇండస్ట్రీ వాళ్ళే నిర్ణయిస్తారు.. మేం అడగడం నేర్చుకోవాలి..

Mrunal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి అందర్నీ తన నటనతో, హావభావాలతో మెప్పించి దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. సీతారామం సినిమా మృణాల్ కి ఎంతో పేరు, స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ ని కూడా పెంచేసిందని టాక్ కూడా వినిపిస్తుంది.

- Advertisement -

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కి తాము ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో వాళ్లకి క్లారిటీ ఉండదు. హీరోయిన్స్ కి ఉన్న హిట్స్, వాళ్ళ స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి ఇండస్ట్రీ వాళ్ళే మా రెమ్యునరేషన్స్ ని నిర్ణయించేస్తారు. కానీ మాకు ఎంత రెమ్యునరేషన్ కావాలో మేము అడగడం నేర్చుకోవాలి, దాని వల్ల మా కెరీర్ మీద, మా వర్క్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అని తెలిపింది. దీంతో మృణాల్ చేసిన ఈ కామెంట్స్ చర్చగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News