ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ను ఆశీర్వదించాలని జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. జనగామ నియోజకవర్గ పరిధిలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు హీటెక్కిస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్ కేటాయిన్నారన్న ఊహాగానాల్లో చేర్యాల, మద్దూర్, దూల్మిట్ట బిఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ముత్తిరెడ్డి కె టిక్కెట్ కేటాయించాలని, ముచ్చటగా రాష్ట్రంలో మూడోసారి బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ కొమురవెళ్లి మల్లికార్జున స్వామికి గురువారం ముడుపుకట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10యేండ్లు అధికారంలో ఉంది కానీ తెలంగాణ ప్రజలు వారిని దూరంగా ఉంచారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు లూటీ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసిఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. గతంలో సాగు, త్రాగు నీరు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్ని కష్టాలతో జీవచ్ఛవంగా మారిన ప్రజలు సీఎం కేసిఆర్ పాలనను దీవిస్తున్నారు.10సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, కర్ణాటక,ఛత్తీస్ ఘడ్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరిగా 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు. సీఎం కేసిఆర్ అన్ని పార్టీల కంటే ముందు 115స్థానాల్లో అభ్యర్థులకు ప్రకటించిన ఘనత సీఎం కేసిఆర్ దేనని అన్నారు.