Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రత మహత్యం

Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రత మహత్యం

సిరిలనిచ్చే శ్రీలక్ష్మీ వ్రతం

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో చైత్రం నుంచి చూస్తే ఐదవ మాసం శ్రావణ పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వలన శ్రావణ మాసం అని అంటారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కనుక మహిళలకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసాన్ని ‘వ్రతాల మాసమని’ పేరు పొందింది. శ్రావణ మాసం లో, వరలక్షి వ్రతం ఎంతో ప్రాశస్త్యం పొందింది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని ఈ రోజు కొలుస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని స్త్రీలు అధికంగా పూజలు నిర్వహిస్తారు..ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు పూజలు చేస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకం తో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు.ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.స్కంద పురాణం ప్రకారం పరమే శ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివ రించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యా లనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబు తారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీ దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వర లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారు మతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వ రుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్ష త్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదా నందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

  • ఆళవందార్‌ వేణు మాధవ్‌
    8686051752
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News