Friday, November 22, 2024
HomeతెలంగాణViveka MLA: ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

Viveka MLA: ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

సమస్యలు చెప్పండి సాల్వ్ చేస్తా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహకల్ప 3 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకకాలంలో 3 కోట్ల నిధులతో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని నియోజికవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కేట్ఆర్ సహకారంతో వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి వహిస్తున్నామని అన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, డిజిఎం అప్పర్ నాయుడు, ఏఈ సురేందర్ నాయక్, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఓపెరటివే సొసైటీ చైర్మన్ మన్నే రాజు, మాజీ కౌన్సిలర్ బోబ్బా రంగ రావు, బిఆర్ఎస్ పార్టీ యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, వెంకట్ స్వామి, తార సింగ్, ప్రభాకర్, రాజ్ కుమార్,పందిరి యాదగిరి, ఖైసర్ పాశా,శ్రవణ్ రాథోడ్, మహిళా నాయకురాలు దేవి, శ్యామల రాథోడ్, సంగీత, రత్నం, రమ్య, నాయకులు, కాలనీ సంక్షేమ సంఘ నాయకులు,సభ్యులు,కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News